ఆంధ్రప్రదేశ్‌

ప్రతి ఇల్లూ కావాలి ‘కవి’తా నిలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: అంతర్జాతీయ బహుభాషా సమ్మేళనానికి హాజరైన అందరూ ఒక్కో ఇంట్లో ఒక కవిని తయారుచేయాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని బరంపార్కులో జరుగుతున్న అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనంలో రెండో రోజైన సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల క్రితమే అమరావతికి ప్రపంచంలో గొప్ప గుర్తింపు ఉందన్నారు. ఆ నేపథ్యంలో నేడు కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం అభినందనీయమన్నారు. ప్రపంచంలో నాగరికత, సంస్కృతి నదీ ముఖద్వారాల వద్దనే ఆవిర్భవించిందని, నదీతీరాల్లో కూర్చుని ఆలోచిస్తే మంచి ఆలోచనలతో పాటు కవిత్వం కూడా రాసే ప్రతిభ చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా కాళోజీ అక్షర రూపమిచ్చిన ‘ఒక సిరా చుక్క.. లక్ష మెదళ్లకు కదలిక’ కవిత చదివి వినిపించారు. కవిత్వానికి ఎల్లలు లేవని, కృష్ణానదికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఈ నదీ పరీవాహక ప్రాంతంలో హాలుడు అనే కవి 70 కవితలు రాశాడని, వాటిలో లీలావతి పరిణయం ప్రధానమైందన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి అమరావతి రాజధానిని పాలించారని, ఆచార్య నాగార్జునుడు ఆ కాలంలో ఉన్నారని, ఆయన రాసిన ప్రజ్ఞా పారమతి అనే గ్రంథం విదేశాల్లో కూడా ప్రాచుర్యం పొందిందని చంద్రబాబు చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రం ఈ ప్రాంతానికే చెందిందని గుర్తుచేశారు. పేరెన్నికగన్న కవులు అనేకమంది ఈప్రాంతంలో జన్మించారని, అందులో ప్రముఖులు విశ్వనాథ సత్యనారాయణ, వేటూరి ప్రభాకర శాస్ర్తీ, వేటూరి సుందరరామమూర్తి వంటి వారెందరో ఉన్నారన్నారు. వేములపల్లి శ్రీకృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా..’ పాట తెలుగునాట ప్రాచుర్యం పొందిందన్నారు.
53 భాషల్లో 535 కవితలతో రూపొందించిన పుస్తకాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ఆవిష్కరించారు. వచ్చే ఏడాది కవి సమ్మేళనంలో సాఫ్ట్ కాపీ కవితలను అందుబాటులోకి తేవాలని కోరారు. సమ్మేళనంలో గోండి, మైథిలి, డోగ్రి, తెలుగు, ఇంగ్లీషు, స్పానిష్, టర్కీ తదితర భాషల్లో కవితలు చదవటాన్ని ప్రసంసించారు. ఈ సమ్మేళనానికి హాజరైన వారిలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారని, వారు దుర్గమ్మ తల్లిని ఆదర్శంగా తీసుకోవాలని, దీంతో వారికి ధైర్యం, శక్తి, మంచి ఆలోచనలు వస్తాయన్నారు.
సంస్కృతిని ప్రోత్సహించాలి
ఐన్ఫర్మేషన్ టెక్నాలజీ, గణితం రెండూ మంచి కాంబినేషన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఈ విషయంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను భాషా పండితులు ప్రోత్సహించాలన్నారు. దేశంలోని భిన్న సంస్కృతులు, భాషలు ఉండటం ప్రపంచంలో ఒక గుర్తింపును తెచ్చిపెట్టిందన్నారు. ఈప్రాంతంలో లభించే ఆహారం కూడా రుచికరంగా ఉంటుందన్నారు. చరిత్ర, సంస్కృతుల గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేందుకు అమరావతిలో అన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.

చిత్రం... విజయవాడలో సోమవారం జరిగిన బహుభాషా కవి సమ్మేళనంలో
535 కవితలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు