ఆంధ్రప్రదేశ్‌

ద్విసభ్య కమిటీ నివేదిక బేఖాతరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 18: రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అచార్యుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని ద్విసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక కాలగర్భంలో కలిసిపోతోంది. ఈ కమిటీ నివేదికను యూనివర్సిటీ అధికారులు బేఖాతరు చేశారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆచార్యుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని విచారించడానికి గవర్నర్ ఆదేశాల మేరకు ద్విసభ్య నిపుణుల కమిటీ విచారణ జరిపి అవకతవకలు జరిగాయని నివేదిక ఇచ్చింది. ఎఐసిటిఇ, యుజిసి నియమ నిబంధనలకు విరుద్ధంగా 13 మంది ఆచార్యుల నియామకం జరిగిందని ఆరోపణలు చేస్తూ 2012లో ద్విసభ్య కమిటీ నివేదిక ప్రభుత్వానికి అందింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అధికారులు అనర్హులైన ఆచార్యులను కాపాడేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ చిత్రమేమిటంటే చర్యలు తీసుకోవాల్సిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లోనే ఎవరైతే అనర్హులని ద్విసభ్య కమిటీ పేర్కొందో వారినే సభ్యులుగా నియమించారు. గవర్నర్ ఆదేశాల మేరకు నియమించిన ద్విసభ్య కమిటీ నివేదికపై చర్యలు తీసుకోకుండా యూనివర్సిటీ అధికారులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కమిటీల మీద కమిటీలు వేస్తూ కావాలనే జాప్యంచేస్తూ అనర్హులైన అచార్యులతో నెట్టుకొస్తూ వర్శిటీ పరువు ప్రతిష్ఠలను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి అనుబంధ కళాశాలల్లో విద్యార్ధుల పరీక్షలకు ఇన్‌స్పెక్షన్ కమిటీ సభ్యులుగా వెళ్ళి అనర్హులైనవారు ఏ విధంగా పారదర్శకంగా వ్యవహరిస్తారో అర్ధం చేసుకోవచ్చని, తక్షణం వీరిపై చర్యలు తీసుకోవాలని ఎపి బార్ అసోసియేషన్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనర్హులైన అచార్యులను, వారిని కాపాడుతున్నవారిపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత కాలం నుంచి తీసుకుంటున్న జీతాల సొమ్మును కూడా రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.