ఆంధ్రప్రదేశ్‌

లంక భూముల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 19: రాజధాని అమరావతిలో లంక భూముల సమీకరణ వివాదాస్పదంగా మారుతోంది. కోర్ కేపిటల్‌కు నిర్దేశించిన లింగాయపాలెంలో 200 ఎకరాల లంక భూములను రాజధాని అవసరాలకు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూమిని సమీకరించడం తగదని దళిత సంఘాల ఆధ్వర్యంలో రైతులు వ్యతిరేకించారు. నష్టపరిహారం ప్యాకేజీ తమకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ భూములను శివాయిజమీదార్‌గా గుర్తించి ఎకరానికి 500 చదరపు గజాల ఇళ్ల స్థలంతో పాటు వంద గజాల వాణిజ్య ప్లాట్లు కేటాయిస్తామని అనుభవదారులకు ప్యాకేజీ ప్రకటించింది. రాజధాని ప్రకటించక ముందు ఈ గ్రామంలో 200 ఎకరాల భూమిని నిరుపేద దళితులకు అసైన్డు చేయడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ మంజూరు చేశారు. దీంతో విద్యుత్, మోటారు పంపుసెట్లు వేసుకుని దళితులు సాగు చేస్తున్నారు. లాండ్ పూలింగ్‌లో భాగంగా ఈ భూములను కూడా సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తమవి కూడా జరీబు భూములుగా పరిగణించి ప్రభుత్వం ఏటా 50వేల నష్ట పరిహారంతో పాటు 1000గజాల ఇళ్ల స్థలం, 400 గజాల వాణిజ్య ప్లాట్లు మంజూరు చేయాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు శనివారం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.