ఆంధ్రప్రదేశ్‌

అంగన్‌వాడీలకు సొంత భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి మరోసారి పెద్ద పీట వేసింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, శిశువులకు పౌష్ఠికాహారం పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 55,581 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో లక్షా 4వేల మందికి పైగా అంగన్‌వాడీ వర్కర్లు పని చేస్తున్నారు. 2016-17 రాష్ట్ర బడ్జెట్‌లో స్ర్తి, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ 1331.73 కోట్లు కేటాయించింది. ఇందులో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు రూ.1772 కోట్లు వెచ్చించింది. అంగన్‌వాడీల సొంత భవనాల కోసం రూ.750 కోట్లు వెచ్చిస్తొంది. ఈ భవనాల్లో 7వేల భవనాల్లో 53శాతం అంటే 3,768 భవనాలు తుది దశకు చేరుకున్నాయి. జిల్లాల వారీగా వివరాల్ని పరిశీలిస్తే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 7వేల అంగన్‌వాడీ కేంద్రాలకు భవన నిర్మాణాలు చేపట్టింది. అత్యధికంగా అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో 833 భవనాలు నిర్మిస్తోంది. అతి తక్కువగా కృష్ణాజిల్లాలో 180 భవనాలు నిర్మిస్తోంది. పశ్చిమ గోదావరిలో 364 భవన నిర్మాణాలు చేపడితే, 303 భవనాలు పూర్తి కావాల్సి ఉంది. విశాఖపట్నంలో 691 భవనాలకు 499 పూర్తి కావొచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో 833 భవనాలకు అనుమతులొస్తే 597 ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.