ఆంధ్రప్రదేశ్‌

ఆన్‌లైన్ ప్లాన్లతో ఆదాయానికి గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 19: రాజధాని ప్రాంతంలో ఏ నిర్మాణాలకైనా ప్లాన్ల కోసం ఆన్‌లైన్‌లో తమకు దరఖాస్తులు చేసుకోవాలని సీఆర్డీయే నిబంధన విధించటం పట్ల సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీయే నో అబ్జక్షన్ సర్ట్ఫికెట్ ఉండి ప్లాన్‌కు అనుమతి మంజూరు చేస్తే తప్ప భూముల లావాదేవీలు, నిర్మాణాలు జరగరాదని ఆంక్షలు విధించింది. దీనిపై కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ్రామసభల ద్వారా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం రాజధాని ప్రతిపాదిత బేతపూడి, నిడమర్రు గ్రామాల్లో సభలు నిర్వహించారు. ప్లానింగ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జెవి రాముడు నేతృత్వంలో సీఆర్డీయే జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ హిమబిందు రైతులు, గ్రామస్థులతో సమావేశమయ్యారు. అధికారులు బృందాలుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సీఆర్డియే డెవలప్‌మెంట్ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సభలలో సర్పంచ్‌లు తమ అధికారాలు, నిధులపై ఆందోళనలు వ్యక్తంచేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ప్లాన్ల వల్ల పంచాయతీ ఆదాయానికి గండి పడుతుందని చెప్తున్నారు. ఇప్పటి వరకు గ్రామాల్లో ఖాళీ స్థలాలపై చదరపు మీటరుకు రూ. 5, నిర్మాణాలకైతే రూ.10 వసూలు చేస్తున్నారు. సీఆర్డీయే నిబంధనల కారణంగా ఆదాయం పంచాయతీల చే జారటంతో పాటు భవన నిర్మాణాలపై అజమాయిషీ ఉండదు. దీనికితోడు ఆన్‌లైన్‌లో ప్లాన్‌లు మంజూరు చేయాలంటే కనీసం రెండు నెలల వ్యవధి పడుతుందని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించాలంటే ప్లాన్ మంజూరులో జాప్యం జరుగుతుందనే సందేహాలను గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు ఆదాయం వచ్చినా, సీఆర్డీయే వసూలు చేసినా అది ప్రభుత్వానికే చెందుతుందని ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు నచ్చచెప్తున్నారు. సెట్‌బ్యాక్, వంశపారం పర్యంగా సంక్రమించిన నిర్మాణాలను మినహాయించాలన్నారు.

చిత్రం.. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో రైతుల సదస్సు