ఆంధ్రప్రదేశ్‌

మావోల విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 19: ఒడిశాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. దీంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలన్నీ భయం గుప్పెట్లో అల్లాడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సరిహద్దు పల్లెల్లో మావోల ప్రతీకారేచ్ఛ రగులుకుంది. కోరాపుట్ జిల్లా సిమిలిగూడ సమితి పరిధిలోని బితోరోకోట వద్ద రహదారి నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదు వాహనాలను దగ్ధం చేశారు. అక్కడ పనిచేసే సూపర్‌వైజర్ జైరాంకిలోను ఇన్‌ఫార్మర్ నెపంతో గొంతుకోసి హత్య చేశారు. ఈ సంఘటనతో రాష్ట్ర హోంశాఖ ఎవోబీ రెడ్‌అల్టర్ చేసింది. ఆంధ్రా-ఒడిశా జిల్లా ఎస్పీలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించారు. కూబింగ్ మరింత పటిష్ఠపరిచారు. ముఖ్యంగా మావోల సెఫ్టీ జోన్స్‌పై నిఘా పెంచారు. వారి కదలికలపై ప్రత్యేక కేంద్ర బలగాలు తూర్పు కనుములతోపాటు, మహేంద్ర గిరులు, తువ్వాకొండలను జల్లెడ పట్టారు. ఉద్దానంలో కూంబింగ్ కొనసాగుతోంది. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో ఆర్.కె. సతీమణి పద్మక్క అలియాస్ శిరీష ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన కుందనాలు సంస్మరణ సభకు విచ్చేయడం, ఉద్యమాలతోనే సరికొత్త ప్రజాస్వామ్యం ఏర్పాటు జరుగుతుందంటూ ప్రకటించింది. ఉత్తరాంధ్ర అమరుల బంధుమిత్రుల సంఘం కార్యదర్శి జోగి కోదండరావు, రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి, రాష్ట్ర సభ్యులు నరసయ్య, తాండ్ర ప్రకాశ్ వంటి ముఖ్యనేతలంతా పాల్గొన్నారు. బాతుపురం సంస్మరణ సభకు భారీ బందోబస్తు, నిఘా పెంచిన జిల్లా పోలీసుశాఖ ఏవోబీలో ప్రత్యేక నిఘా కాసేపు నిద్రవస్థలో ఉండడంతోనే ఒడిశాలో బీభత్సం జరిగిందంటూ పోలీసు ఇంటెలిజెన్స్ నివేదికలు కేంద్ర హోంశాఖకు పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒడిశాలోని మల్కజ్‌గిరి జిల్లాలో 147 మంది మావోయిస్టుల సానుభూతిపరులు పోలీసుల ముందు లొంగిపోయారు. మరోపక్క ఏవోబీలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తర్వాత ముఖ్యమంత్రి తనయుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యదర్శి నారా లోకేష్‌పై ఆత్మాహుతి దళాలు దాడికైనా సిద్ధమంటూ మావోనేతలు చేసిన హెచ్చకలు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పార్టీ సభ్యుల నమోదు కార్యక్రమానికి విచ్చేయాల్సిన లోకేష్ పర్యటన రద్దయింది. కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరికలతోపాటు, ఇటీవల ఏవోబీలో జరుగుతున్న పలు ప్రతీకారేచ్ఛ చర్యలు కారణంగా జిల్లాలో లోకేష్ పర్యటన రద్దు చేయాలంటూ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె.బ్రహ్మారెడ్డి రాష్ట్ర పోలీసుబాసుకు విజ్ఞప్తి చేయడంతో రద్దయ్యినట్టు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌతు శిరీష ‘ఆంధ్రభూమి’కి చెప్పారు.

చిత్రం.. మావోలు తగులబెట్టిన వాహనాలు