ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో రూ.300 కోట్లతో బల్బ్‌లైన్ ఎలివేటెడ్ కారిడార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: విశాఖ రైల్వే స్టేషన్‌లో ఇంజన్ రివర్స్ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు వీలుగా బల్బ్‌లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే ప్రతిపాదనను తూర్పు కోస్తా రైల్వే తెరపైకి తెచ్చింది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయం కాగల ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు రైల్వే అధికారులు ఉంచారు. విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్, వాల్తేరు డివిజన్ డిఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీని కలిసి వాల్తేరు పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పరిధిలో ప్రగతిపై వివరించారు. ఈ సందర్భంగా ఉమేష్ సింగ్ మాట్లాడుతూ విశాఖ నుంచి విశాఖ పోర్టు మీదుగా గోపాలపట్నానికి బల్బ్‌లైన్ నిర్మించాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో కీలకమైన విశాఖ రైల్వే స్టేషన్‌లో ఏ రైలు అయినా స్టేషన్‌కు వచ్చిన దారిలో వెనక్కి రావాల్సి ఉంటుందని, ఇంజన్‌ను మార్చేందుకు 20 నిమిషాల సమయం పడుతోందని వివరించారు. దీని వల్ల విశాఖ వచ్చే అన్ని రైళ్లను 20 నిమిషాల సేపు హాల్టింగ్ ఇవ్వాల్సి ఉంటోందని తెలిపారు. దీనిని అధిగమించేందుకు బల్బ్ లైన్ నిర్మించాలన్నారు. విశాఖ స్టేషన్ దక్షిణం వైపు నుంచి విశాఖ పోర్టు ఆర్ అండ్ డి యార్డు ద్వారా గోపాలపట్నంలో విశాఖ-హౌరా-చెన్నై లైనులో కలపడం ద్వారా ఈ సమయాన్ని తగ్గించవచ్చన్నారు. ఎలివేటెడ్ బల్బ్‌లైనును నిర్మించడం ద్వారా వేచి ఉండే సమయాన్ని 10 నిమిషాలకు తగ్గుతుందని తెలిపారు. ఇంజన్ రివర్స్ సమస్య, సమయం, విద్యుత్ ఆదాయ చేయవచ్చని, విశాఖ స్టేషన్ హ్యాండ్లింగ్ కెపాసిటీ పెంచవచ్చని సిఎంకు తెలిపారు. ఇందుకు 4, 2 కిలోమీటర్ల మేర రెండు రైల్వే లైన్లు కొత్తగా నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు విశాఖ పోర్టును ఒప్పించాలని సిఎంను రైల్వే అధికారులు కోరారు. పరిశీలిస్తానని హామీ ఇచ్చిన సిఎం, పోర్టు ట్రస్టు అధికారులతో మాట్లాడిన తరువాత మరోసారి సమావేశమై వివరంగా చర్చిద్దామని తెలిపారు.