ఆంధ్రప్రదేశ్‌

రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క కూలీ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు, చిన్న నోట్ల కొరత సామాన్యుల ప్రాణాలమీదికి తెస్తోంది. రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క విసిగివేశారిన కూలీ ముర్తుజావలీ(40)మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డినగర్ కాలనీకి చెందిన ముర్తుజావలి(40) కంకరపని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారం రోజుల పాటు కూలీపని చేసినందుకు యజమాని కూలిడబ్బుల కింద రూ.2 వేల నోటు ఇచ్చాడు. దీంతో మంగళవారం నిత్యావసర సరుకుల కోసం కిరాణా దుకాణాలకు వెళ్లగా పెద్దనోటుకు తమ వద్ద చిల్లర లేదని, మొత్తం రూ. 2 వేలకు సరిపడ సరుకులు తీసుకుంటే ఇస్తామని చెప్పడంతో తీవ్ర మనోవేదనకు గురై క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో కర్నూలుకు తరలించారు. దీనిపై ముర్తుజావలి భార్య ఫాతిమాబీ మాట్లాడుతూ పెద్దనోటు తన భర్త ప్రాణం మీదికి తెచ్చిందని వాపోయారు. ఎక్కడా చిల్లర ఇవ్వలేదని, రూ.2 వేలకు సరుకులు తీసుకుంటే మిగతా ఖర్చులకు ఎలా అని ప్రశ్నించింది. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు నందికొట్కూరు ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు.