ఆంధ్రప్రదేశ్‌

ఇ-పోస్‌కు మారాలన్నా కష్టమే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడంలో భాగంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించనప్పటికీ అందులోనూ కష్టాలు తప్పేట్టులేదు. ప్రతీ దుకాణంలో స్వైపింగ్ మెషీన్ (ఇ-పోస్) అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరే సూచనలు కనిపించడంలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రూ.500, రూ.1000 నోట్లు కేంద్రం రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు వివిధ రూపాల్లో కష్టాలెదుర్కొంటున్నారు. ఎటిఎంలు పనిచెయ్యకపోవడం, బ్యాంకుల్లో కేవలం రూ.2000 నోట్లు రావడం, భారీ రద్దీ తదితర సమస్యలు తలెత్తాయి. దీనితో నగదు రహిత లావాదేవీలు ఇ-పోస్ యంత్రాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.10 విలువైన వస్తువు కొనుగోలు చేసే ప్రతి దుకాణంలో స్వైపింగ్ మెషీన్ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దుకాణాల్లో వ్యాపారులు ఇ-పోస్ యంత్రాలు ఏర్పాటుచేసుకునేలా చూసే బాధ్యతను ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించింది. దీంతో డిసిటిఒ, ఎసిటిఒ స్థాయి అధికారులు రోడ్డున పడ్డారు. తమ తమ పరిధిలో ఉన్న ప్రతీ దుకాణానికి వెళ్ళి ఇ-పోస్ తప్పనిసరిగా ఏర్పాటుచేసుకోవాలని ఆదేశిస్తున్నారు. స్వైపింగ్ మెషీన్లు ఇప్పటికే ఉన్నవారికి, కొత్తగా ఏర్పాటుచేసుకున్న వారికి నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇ పోస్ మెషిన్లు ఏర్పాటుచేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం వరకూ బాగానే ఉన్నా, అడిగిన వారందరికీ ఇప్పటికిప్పుడు ఆ మెషిన్లు సరఫరా చేసే పరిస్థితి మాత్రం లేదు. ఇప్పటికిప్పుడు ఉన్న డిమాండు ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 5 లక్షల స్వైపింగ్ మెషీన్లు అవసరం అని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం టర్నోవర్ ట్యాక్స్ (టిఒటి) ద్వారా వాణిజ్య పన్నుల శాఖ వద్ద నమోదైన డీలర్లు సుమారు 2.5 లక్షల మంది ఉన్నారు. వీరంతా రూ.7.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు టర్నోవరు ఉన్న వ్యాపారులు. ఇక రిజిస్టర్ కాని వారు కూడా అదే స్థాయిలో ఉండవచ్చన్నది ఆ శాఖ అంచనా. తక్కువ టర్నోవరు ఉన్న వీరందరూ పన్నులు చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. చేతిలో నగదులేని కారణంగా ప్రతీ ఒక్కరూ స్వైపింగ్ మెషీన్ ఉన్న దుకాణాల వైపే మొగ్గుచూపుతారు. దీంతో కచ్చితంగా ప్రతీ వ్యాపారీ రిజిస్టర్ చేసుకోవాల్సిందే. ఇ-పోస్ ఏర్పాటుచేసుకుని, లావాదేవీలు కొనసాగించాల్సిందే. అంటే మొత్తంమీద సుమారు ఐదు లక్షల మందికి మెషిన్లు అందించాల్సివుంటుంది.
వ్యాపారికి ఇ-పోస్ యంత్రం కావాలంటే బ్యాంకు ద్వారా రావలసిందే. దీనికి రూ.10 వేలతో కరెంటు ఖాతాను తెరవాలి. సాధారణంగా దరఖాస్తు చేసుకుంటే 10 నుంచి 15 రోజుల్లో ఇస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కాని నగదు రహిత లావాదేవీలు నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం కచ్చితంగా చెప్పడంతో దాదాపుగా వ్యాపారులంతా ఇ-పోస్ యంత్రాల కోసం ఎగబడుతున్నారు. ఒక్కసారిగా వ్యాపారులంతా ఇ-పోస్ యంత్రాల కోసం వస్తుండటంతో డిమాండ్‌కు తగ్గట్టుగా యంత్రాలు సరఫరా చేసే పరిస్థితి బ్యాంకుల నుంచి కన్పించడంలేదు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టరయిన సుమారు 2.5 లక్షల మంది వ్యాపారులకు ఇ-పోస్‌లు సరఫరా చేయాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఒకరు చెప్పారు.
ఇదిలా ఉంటే ఇ-పోస్‌గా పేరొందిన మినీ ఎటిఎంలకు బ్యాంకులు ఆఫర్లు కూడా ప్రకటించాయి. ఈ-పోస్ యంత్రం ఖరీదు సుమారు రూ.25వేలు ఉంటుంది. ఆ ధర చెల్లించలేని వ్యాపారులు వైర్లతో ఏర్పాటుచేసుకునే దానికి నెలవారి రూ.220, కార్డులెస్ వాటికి రూ.400 రెంటల్ చెల్లించాలి. ఇక 3 నెలల్లో లక్ష లావాదేవీలు చేసేవారికి రెంటల్ ఉచితం అని బ్యాంకులు ప్రకటించడం విశేషం.