ఆంధ్రప్రదేశ్‌

చరిత్రలో నిలిచేలా సైన్స్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 29: తిరుపతిలో రహదారులు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్ట్, వర్సిటీల ప్రాంగణాలు, ముఖ్య కూడళ్లు సుందరీకరించాలి. డిసెంబర్ రెండవ వారంలోగా ఆయా పనులన్నీ పూర్తి చేసి ఇతర ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సైన్స్ కాంగ్రెస్‌పై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చరిత్రలో నిలిచేలా ఈవెంట్ ఉండాలన్నారు.
ఇది మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు దక్కిన అవకాశమని స్పష్టం చేశారు.మొత్తం 16 వేల మంది సైన్స్ కాంగ్రెస్‌కు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, 5 రోజుల ఈవెంట్‌లో మహిళలకు, బాలలకు ప్రత్యేకంగా ఉమెన్ సైన్స్ కాంగ్రెస్, ఛిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారని చెప్పారు. సైన్స్ కాంగ్రెస్‌కు వివిధ దేశాల నుంచి ప్రత్యేకంగా 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, 200 మంది శాస్తవ్రేత్తలు జాతీయ పరిశోధన శాలలకు చెందిన శాస్తవ్రేత్తలు, ఫ్యాకల్టీ మెంబర్లు, రీసెర్ఛి స్కాలర్లు, వివిధ విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు, ఐసర్‌లకు చెందిన అధ్యాపకులు మొత్తం 12 వేల మంది హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు కేంద్ర మంత్రుల స్థాయిలో ప్రొటోకాల్ పాటించాలని ముఖ్యమంత్రి నిర్దేశం చేశారు. ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆహ్వానించాలని నిర్ణయించారు. బాలల సైన్స్ కాంగ్రెస్ ముఖ్య అతిథిగా అంతరిక్ష వ్యోమగామి సునీత విలియమ్స్‌ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ చిహ్నంగా తిరుపతిలో వంద ఎకరాలలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు. ప్రారంభం రోజునే సైన్స్ మ్యూజియం నిర్మాణానికి ప్రధాన మంత్రితో శంకుస్థాపనను, తిరుమల సప్తగిరిల థీమ్‌తో 7 గ్లోబుల ఆకారంలో సైన్స్ మ్యూజియం నిర్మాణం, హాంక్‌కాంగ్ మ్యూజియం స్పూర్తితో దేశంలోనే అతి పెద్ద సైన్స్ మ్యూజియం నిర్మాణంలో సన్నాహాలు చేస్తున్నారు. సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణకు నలుగురు మంత్రులతో కమిటీ, కమిటీలో గంటా శ్రీనివాసరావు, పి.నారాయణ, పైడికొండ మాణిక్యాలరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని నియమించారు.

చిత్రం.. మంత్రుల కమిటీ సమీక్షలో మాట్లాడుతున్న చంద్రబాబు