ఆంధ్రప్రదేశ్‌

నగదు రహిత రాష్ట్రంగా ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయటంతో ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ కొత్త కరెన్సీ నోట్ల కోసం తిరుగుతూనే ఉన్నారు. దీనిని నివారించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక వినూత్న చర్యలు తీసుకుంటున్నాయి. చర్యలతో పాటు వీసా కార్డులు, డెబిట్ కార్డులను ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేందుకు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు జరపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని రేషన్ షాపుల్లో ఈ-పాస్ విధానంలో బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్ అనుసంధానంతో నగదు రహిత లావాదేవీలు జరిపి సరుకులు అందిస్తున్నారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌ను కూడా బయోమెట్రిక్ విధానం అమలు పరచి వారి ఇంటి దగ్గరే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 8నెలల నుంచి రాష్ట్రంలో నగదు రహిత విధానాల అమలుకు చర్యలు ఊపందుకున్నాయి. నోట్లను రద్దు చేయటంతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను అధిగమించటానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో ఉంచారు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లను బ్యాంకులకు సరఫరా చేయటంతోపాటు, అందుబాటులో ఉన్న నగదు రహిత విధానాలను రాష్ట్రంలో తీసుకురావటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా మొబైల్ యాప్‌లను రూపొందించటం, ఈ-పాస్ మిషన్లు అందుబాటులో ఉంచటం, ఆన్‌లైన్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్స్ జరిగేలా ప్రజలను మోటివేట్ చేయటంతో పాటు రైతు బజార్లు తదితర చోట్ల మైక్రో మిషన్లు ఉంచి, ఆధార్ అనుసంధానం జరిగిన బ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి బయోమెట్రిక్ విధానంలో నగదును అందించటం జరుగుతోంది. ఈ విధానం వల్ల ప్రజలు నిత్యావసరాలు కొనే సమయంలో ఏర్పడే ఇబ్బందిని తీర్చడానికి అవకాశం ఉంటుంది. నగదు రహిత విధానాన్ని ప్రోత్సహించటంతో పాటు, ఆర్బీఐ అధికారులతో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి రాష్ట్రానికి మరిన్ని చిన్న నోట్లు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలు బ్యాంకులలో, ఎటియంలలో అందుబాటులో ఉంచేలా బ్యాంకు మేనేజర్లకు మార్గదర్శకత్వం చేస్తుంది. జిల్లా అధికారులు కూడా వారితో ప్రత్యక్షంగా వీడియో కాన్ఫరెన్స్‌లు జరిపి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల కోసం మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లతో పాటు మామూలు ఫోన్ల ద్వారా కూడా యుయస్‌యస్‌డి విధానంలో నగదు రహిత విధానంలో లావాదేవీలు జరపటానికి ఒక యాప్‌ను డెవలప్ చేసింది.