ఆంధ్రప్రదేశ్‌

‘్ఫర్మశీ’కి ఉపాధి వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుకొండ, డిసెంబర్ 3: ఫార్మశీ రంగానికి ఉపాధి అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అసోసియేషన్ (ఐపిఎ) అధ్యక్షుడు డాక్టర్ రావ్ వడ్లమూడి తెలిపారు. ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకూ విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో నిర్వహించనున్న 68వ ఫార్శశీ జాతీయ సమావేశాల నేపధ్యంలో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిడిగట్ల సమీపంలోని వికాస్ ఫార్మశీ కళాశాలలో ఐపిఎ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐపిఎ అధ్యక్షుడు వడ్లమూడి, వైస్ ప్రెసిడెంట్ టివి నారాయణ స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఫార్మశీ రంగానికి ఉపాధి అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయని, ఫార్మశీ రంగాన్ని ఎంచుకున్న ప్రతీ ఒక్క విద్యార్థికి కొలువు దొరుకుతుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ నెల 16వ తేదీ నుండి 18వరకూ అతిపెద్ద జాతీయ ఫార్మాస్యూటికల్ తొలి సదస్సు విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకూ దేశంలో జరిగిన అన్ని సదస్సులకంటే ఇదే అతిపెద్ద సదస్సు అని అన్నారు. విశాఖపట్నంలో ఇప్పుడిప్పుడే ఫార్మశీ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సదస్సుకు దేశ నలుమూలల నుండి సుమారు 10వేల మంది ఫార్మా రంగానికి చెందిన వారు హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొమ్మినేని శ్రీనివాస్, సిహెచ్ అయ్యన్నపాత్రుడు పాల్గొంటారని తెలిపారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ఐపిఎ చైర్మన్ డాక్టర్ రావ్ వడ్లమూడి