ఆంధ్రప్రదేశ్
అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 5 December 2016
విశాఖపట్నం, డిసెంబర్ 4: దక్షిణ అండమాన్ సముద్రంలో అండమాన్ దీవులకు సమీపంగా ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24 గంటల్లో ఇది వాయుగుండంగాను, అనంతరం 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగాను బలపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం దీని ప్రభావం కోస్తాపై పెద్దగా లేనప్పటికీ దక్షిణ కోస్తాలో మాత్రం తేలిక పాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీవ్ర వాయుగుండం బలపడి తుపానుగా ఉద్ధృతమయ్యే అవకాశాలపై ప్రస్తుతానికి స్పష్టత రాదని, రెండు రోజుల అనంతరం దీని గమనం, ఇతర అంశాల ఆధారంగా అంచనా వేస్తామన్నారు.