ఆంధ్రప్రదేశ్‌

యువకుడిపై నైజీరియన్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, డిసెంబర్ 4: గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని వడ్డేశ్వరం గ్రామంలోని మద్యం దుకాణంలో ఏర్పడ్డ వివాదంతో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలోని ఒక విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువుల కోసం వచ్చిన సూడాన్, నైజీరియా దేశాలకు చెందిన యువకులు, వడ్డేశ్వరం గ్రామానికి చెందిన సునీల్ అనే యువకుడు వేర్వేరుగా మద్యం దుకాణానికి వెళ్లారు. క్యూలైన్, చిల్లర వ్యవహారంలో సూడాన్, నైజీరియన్ యువకులకు, వడ్డేశ్వరం యువకుడు సునీల్‌కి మధ్య వివాదం తలెత్తింది. దీనితో షాపు యాజమాన్యం ప్రతినిధులు వారిని మందలించి బయటకి పంపివేశారు. మద్యం దుకాణం నుండి బయటకి వచ్చిన యువకులు రోడ్డుపై ఎదురుపడటంతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సూడాన్, నైజీరియన్ యువకులు సునీల్‌పై కత్తితో దాడి చేసి పీక కోశారు. సునీల్ వారిపై మద్యం బాటిల్‌తో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో సునీల్ మెడపై గాయం కాగా విదేశీ యువకుడికి తల పగిలి తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువురినీ ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. అయితే చదువుకునేందుకు వచ్చిన విదేశీ విద్యార్థులు స్థానికంగా ఉన్న వారిపై దాడికి పాల్పడటం ఏమిటని, వారికి బుద్ధిచెప్పాలని పట్టుపట్టారు. కాగా, సునీల్ పరిస్థితి విషమంగా ఉంది. దీనితో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టారు.