ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరుకు 30 వేల ఈపాస్ యంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 4: చిత్తూరు జిల్లాకు 30 వేల ఈపాస్ యంత్రాలను అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ఆదివారం తిరుపతిలో మంత్రి మంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు, చిల్లర సమస్యలు, నగదు అందుబాటులో లేని నేపధ్యంలో సిఎం చంద్రబాబు ఆలోచన మేరకు నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించిందన్నారు. చిత్తూరు జిల్లాకు కరికాల వళవన్‌ను నోడల్ అధికారిగా నియమించినట్లు ఆయన తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లాలోని విభిన్న రంగాలకు చెందిన ప్రజల అభిప్రాయాలను సేకరించి సిఎం దృష్టికి తీసుకెళ్లేందుకు తన అధ్యక్షతన కమిటీ కృషి చేస్తుందని మంత్రి చెప్పారు.