ఆంధ్రప్రదేశ్‌

ముస్లిం మైనార్టీలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. పేద మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి ముస్లింలకు పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులకు పెద్దఎత్తున నిధులను మంజూరు చేస్తున్నారు. మసీదుల నిర్మాణంతో పాటు, పురాతన మసీదుల పునర్మిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. ఇటీవలి కాలంలో మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున కృషి చేస్తోంది. మైనార్టీలను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేవరకు వారికి కావలసిన అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలతో మైనార్టీల్లో ఆనందం వ్యక్తవౌతోంది. రాష్ట్రంలోని మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు గౌరవ వేతనం చెల్లించేందుకు ప్రభుత్వం 2016 జూన్ 8న జీవో నెంబర్ 21 విడుదల చేసింది. ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతన నిబంధనకు అర్హత ఉన్న మసీదులకు నెలకు రూ.8వేలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 2500 మసీదులకు నెలనెలా గౌరవ వేతనాన్ని మైనార్టీ శాఖ చెల్లించాలని నిర్ణయించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.4కోట్లు విడుదల చేయగా, ఈ ఏడాది ఆ మొత్తాన్ని 6 రెట్లు పెంచి రూ.24 కోట్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే ఇందుకోసం రూ.12 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే 1234 మసీదులకు గౌరవ వేతనాన్ని చెల్లిస్తుండగా మరో 1266 దరఖాస్తులను త్వరలోనే పరిష్కరించనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉషాకుమారి వెల్లడించారు. వాస్తవానికి మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే ఇమామ్‌లు పేదరికంలో మగ్గుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మసీదు కమిటీలు ఉన్నప్పటికీ పలు మసీదులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మైనార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే ఇమామ్‌లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఇమామ్‌లు, వౌజన్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వ గుర్తింపు లభించడం మైనార్టీలకు లభించిన గౌరవంగా వారు అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో తమకు బాధ్యత పెంచినట్టవుతుందని పేర్కొంటున్నారు. మైనార్టీల కోసం దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ లేనన్ని పథకాలను ప్రవేశపెట్టినట్లు మైనార్టీ, సమాచార పౌర సంబంధాలు, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఘనంగా మైనార్టీల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. మైనార్టీలకు రానున్న రోజుల్లో ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతోందని, హజ్‌హౌస్‌ను సైతం విజయవాడకు తరలిస్తున్నామని తెలిపారు. ఉర్దూ యూనివర్శిటీ ప్రారంభించామని, విద్యార్థులకు వేల సంఖ్యలో స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఏడాది నుంచి మైనార్టీలు విదేశాల్లో చదువుకోడానికి సైతం పంపనున్నామని మంత్రి రఘునాథరెడ్డి వివరించారు.