ఆంధ్రప్రదేశ్‌

ఎపి మెడికల్ కౌన్సిల్ ఉత్సవ విగ్రహమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: రాష్ట్రంలో విద్యా రంగంలో ఎంతో కీలకమైన వైద్యవిద్యా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ‘ఎంసిఐ’ కీలక నిర్ణయాలు తీసుకుంటుంటే వైద్య రంగంలో 10 మంది నిష్ణాతులతో ఏర్పాటైన ఎపి మెడికల్ కౌన్సిల్ ప్రేక్షకపాత్ర వహించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలన్నీ కలిపి 38 వరకు ఉంటే వీటిల్లో 4500 ఎంబిబిఎస్, 2500 పిజి సీట్లు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సీట్లు ఎప్పుడు, ఎందుకు పెరుగుతున్నాయో మళ్లీ ఎందుకు రద్దు చేయబడుతున్నాయో ఎపి మెడికల్ కౌన్సిల్‌కు ఏ మాత్రం తెలియని స్థితి నెలకొంది. సామాన్యుడిలా పత్రికల్లో వార్తలు చూసి తెలుసుకోవాల్సిన దుస్థితి. ఎంసిఐ విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2017-18 విద్యా సంవత్సరం 300 ఎంబిబిఎస్ సీట్లను రద్దు చేసింది. దీనిపై ఎపి మెడికల్ కౌన్సిల్‌కు ఎలాంటి సమాచారం లేదు. ఎంసిఐ సభ్యులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి ముందస్తు సమాచారం అందిస్తే తమకు వీలైన సమయంలో వచ్చి వైద్య కళాశాలల్లో వౌలిక సదుపాయాలను పరిశీలించి వెళుతున్నారు.