ఆంధ్రప్రదేశ్‌

మార్చి నాటికి రోడ్డు సెక్టార్ ప్రాజెక్టు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: ప్రపంచ బ్యాంక్ రుణం రూ.2245 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్డు సెక్టార్ ప్రాజెక్టు పనులను వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ (ఎపిఆర్‌డిసి) గవర్నింగ్ బాడీ సమావేశం వెలగపూడి సచివాలయంలో సోమవారం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ అందచేస్తున్న 3806 కోట్ల రూపాయల రుణంతో వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు పనులకు టెండర్లను పిలిచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. 4154 కోట్ల రూపాయలతో అంచనాతో విదేశీ రుణంతో చేపట్టే ప్రాజెక్టులపై కూడా చర్చించారు. ఆస్ట్రేలియన్ అడ్వాన్స్ డేటా కలెక్షన్ ఎక్విప్‌మెంట్ వెహికల్ ద్వారా జరుగుతున్న రోడ్డు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ సిస్టిమ్ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.