ఆంధ్రప్రదేశ్‌

రైతులు, పెన్షనర్లు ఇబ్బంది పడకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: రైతులు, చేతివృత్తులవారు, పెన్షనర్లు ఇబ్బందులు పడకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల పురోగతిపై సోమవారం తన నివాసం నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చేతివృత్తులవారి ఉపాధి దెబ్బతినకుండా అధికార యంత్రాంగం శ్రద్ధ వహించాలన్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో బ్యాంకులు, ఎటిఎంల వద్ద రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. బ్యాంకుల వద్ద క్యూల్లో నిలబడ్డ వృద్ధులు, వికలాంగులు, పెన్షనర్లకు కనీస వసతులు కల్పించాలన్నారు. రూ.50, రూ.20 నోట్లు కొత్తవి రానున్నాయని, అవి వస్తే చిల్లర సమస్య ఉండదని, చాలావరకు ఒత్తిడి తగ్గుతుందని బాబు తెలిపారు. రాష్ట్రంలో కొన్ని గ్రామాలనైనా వెంటనే నగదు రహితంగా మార్చాలని, వాటి స్ఫూర్తితో మిగిలిన గ్రామాలు కూడా నగదు రహితంగా రూపొందుతాయని సిఎం ఆకాంక్షించారు. పాస్ మిషన్ల కొరత లేకుండా చూడాలని, నగదు రహిత లావాదేవీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. గ్రామాలను నగదు రహితంగా మార్చేందుకు బ్యాంకర్లు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు. మొబైల్ వ్యాన్ల ద్వారా నగదు పంపిణీని బ్యాంకులు ముమ్మరం చేయాలని, ఎక్కడికక్కడ కార్డులు స్వైప్ చేసి కనీసం రూ.2 వేలు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలపై ప్రజలను ప్రోత్సహించేందుకు ఆదివారం విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు. జన్‌ధన్ కార్డులు, రూపె కార్డులు అన్నింటినీ యాక్టివేట్ చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 వేల రేషన్ డిపోలు, 1100 ఎరువుల దుకాణాల వద్ద ఉన్న పోస్ మిషన్లను సక్రమంగా వినియోగించుకునేలా ఆంధ్రాబ్యాంకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ఐదు జిల్లాల్లో రేషన్ డిపోలు నగదు రహితంగా మారాయని, రేపు మరో 5 జిల్లాల్లో అవుతాయని అధికారులు వివరించగా, మిగిలిన 3 జిల్లాల్లో కూడా రేషన్ డిపోలను క్యాష్‌లెస్‌గా మార్చాలని ఆదేశించారు. ఇప్పటివరకు 55 శాతం నగదు రహిత లావాదేవీలు రేషన్ డిపోల్లో జరిగాయని, మిగిలిన వాటిల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 60 శాతం ట్రాన్సాక్షన్స్ జరగడంపై సంతృప్తి వ్యక్తం చేసి మిగిలిన జిల్లాలు కూడా ఆ స్థాయిని అందుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నగదు కొరత సమస్య పరిష్కారంపై కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. ఏజెన్సీలో కూడా పోస్ మిషన్ల వినియోగం జరిగేలా సాంకేతిక అడ్డంకులు తొలగించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా నమోదైన 109 ఇంజనీరింగ్ కళాశాలలు, 380 డిగ్రీ కళాశాలలను బిజినెస్ కరస్పాండెంట్లుగా వ్యవహరించేలా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను కోరినట్లు ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. 34 మండలాల్లో ఒక్కో గ్రామానికి ఒకో అధికారిని నియమించి, ఆ గ్రామాన్ని బ్యాంకు దత్తత చేసుకుని నగదు రహితంగా మార్చేలా చేస్తున్నామని శ్రీకాకుళం కలెక్టర్ వివరించారు. సెర్ఫ్ సిఇవో కృష్ణమోహన్ మాట్లాడుతూ మొత్తం 42 లక్షల మంది పింఛనుదార్లకు 35 లక్షల మంది ఖాతాల్లో పింఛన్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నగదు రహిత లావాదేవీలపై సర్వే ద్వారా తీసుకున్న ప్రజాభిప్రాయాలను అధికారులకు, బ్యాంకర్లకు చంద్రబాబు వివరించారు.