ఆంధ్రప్రదేశ్‌

పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం పునరావాసం
ఎలా చేపడుతున్నారు?
రాజ్యసభలో విజయసాయి ప్రశ్న
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిబంధనల ప్రకారం పునరావాస కార్యకలాపాలు జరుగుతున్నాయని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం, కేంద్ర జలవనరుల శాఖ పర్యవేక్షణలో కార్యకలాపాలు జరుగుతున్నట్టు సోమవారం రాజ్యసభకు తెలిపారు. వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు నిర్వసితులకు చెప్పటిన కార్యకాలాపాలపై ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన గిరిజనులు, రైతులు, సామాజిక వేత్త పెంటపాటి పుల్లరావుతో పోలవరం ప్రాజెక్టు అథారిటీతో సమావేశమైనట్టు తెలిపారు. రాజమండ్రి, విశాఖపట్నం జాతీయ రహదారుల మధ్య టోల్ ప్లాజాల నిర్వహణపై మరో ప్రశ్నను రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగారు.
విశాఖను రైల్వే
జోన్‌గా ప్రకటించాలి
లోక్‌సభలో ఎంపీ అవంతి శ్రీనివాస్
విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ కేంద్రంగా రైల్వేజోన్ వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయాలని టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ కోరారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయనీ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ విభజన చట్టంలో ఏపీ ప్రత్యేక రైల్వేజోన్ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఏపీలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ పాటు ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ పరిధిలోని వాల్తేరు డివిజన్‌ను కలుపుకొని కొత్త జోన్ ఏర్పాటు చేస్తామని విభజన సమయంలో చెప్పారని గుర్తుచేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉందని చెప్పారు. విశాఖ రైల్వే స్టేషన్ దగ్గరలోనే రైల్వేజోన్‌కు అవసరమైన భూమి, విశాఖలోనే రెండు ప్రధాన నౌకశ్రయాలు ఉన్నాయన్నారు.
హైస్పీడ్ జాబితాలో
అమరావతిని చేర్చాలి
లోక్‌సభలో ఎంపీ గల్లా సూచన
హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు సాధ్యసాధ్యాలపై రైల్వేశాఖ, జర్మనీ ప్రభుత్వ చేస్తున్న అధ్యాయనంలో ఏపీ నూతన రాజధాని అమరావతిని చేర్చాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు.
మైసూర్- బెంగళూరు -చెన్నై -విజయవాడ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాడానికి అధ్యయాన జాబితాలో అమరావతి కలపడానికి సాధ్యాసాధ్యాలను పరిశిలించాలని జీరోఅవర్‌లో ఈ అంశాన్ని ఎంపీ గల్లా జయదేవ్ లేవనేత్తారు. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో ఇటీవల విజయవాడను చేర్చారని, ఏపీ నూతన రాజధాని అమరావతి కూడా కారిడార్ అధ్యయన జాబితాలో చేర్చాలని కోరారు.
నాయక్‌పోడులను
ఎస్‌టిలుగా గుర్తించాలి
లోక్‌సభలో కేశినేని డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలంలోని నాయక్‌పోడు కులం వారిని షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని తెలుగుదేశం సభ్యుడు కేశినేని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేశినేని శ్రీనివాస్ సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో నాయక్‌పోడు కులం వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి విస్సన్నపేట మండలానికి వలస వచ్చిన నాయక్‌పోడు సామాజిక వర్గానికి చెందిన సుమారు 400 కుటుంబాలు మాత్రమే ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణలో వారిని ఎస్‌టిలుగా గుర్తించారని ఆయన గుర్తుచేశారు. ఏపిలో ఎస్‌టిలుగా గుర్తించలేదని సభకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్‌టి ధృవీకరణ లభించేలాచర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.