ఆంధ్రప్రదేశ్‌

నేడు మరిన్ని డబ్బులు వస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: పెద్దనోట్ల రద్దీ ఇబ్బందులను తొలగించేందుకు గాను బుధవారం మరో రూ.1100 కోట్లు నగదు రాష్ట్రానికి రానున్నదని ఆపై దశలవారీగా రూ.50, రూ.20ల చిన్న నోట్లు కూడా త్వరలో రానున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇటీవల వచ్చిన రూ.2400 కోట్ల నగదు వల్ల చాలా వరకు ఒత్తిడి అధిగమించామన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసి 27 రోజులు గడుస్తున్నా వాస్తవానికి సంక్షోభం పరిష్కారం కాలేదు కానీ ఒత్తిడి మాత్రం కొంతమేర తగ్గించగలిగామని చంద్రబాబు అన్నారు. మంగళవారం బ్యాంకర్లు, ఆర్ధికశాఖ అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది సున్నితమైన అంశమని, అన్ని వర్గాలకు, సాంకేతికతకు సంబంధించిన అంశమని ఆయన అన్నారు.
నగదు వాడకం తగ్గాలని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, అవసరం మేరకే నగదును వాడుకోవాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. నగదు వాడకం, పోస్ మిషన్ల వినియోగం, ఆన్‌లైన్ లావాదేవీలు ఈ మూడు పరస్పర పూరకాలుగా గుర్తించాలన్నారు. విత్తనాలు, ఎరువులు, క్రమిసంహారక మందులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేలా చూడాలని, కూలీలకు మాత్రం నగదు పంపిణీ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో బిజినెస్ కరస్పాండెంట్లను నియమించి ప్రయాణీకులు నగదుకు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు.
నగదు రహిత లావాదేవీల్లో పొరబాటు జరిగితే వెంటనే సరిదిద్దేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని, ప్రజల్లో వీటిపై విశ్వాసం పెరిగేలా చూడాలని బ్యాంకర్లకు సూచించారు.
నైపుణ్యాభివృద్ధిలో నగదు రహిత లావాదేవీల నిర్వహణను కూడా భాగం చేయాలన్నారు. 40 లక్షల మంది విద్యార్థులు 40 లక్షల కుటుంబాలను చైతన్యపరచి, నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచాలన్నారు.