ఆంధ్రప్రదేశ్‌

గురుకుల పాఠశాలలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, డిసెంబర్ 6: గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని గర్భం దాల్చిన సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఆ చిన్నారికి 5వ నెల. దీంతో ఆసపత్రిలో చేరింది. వివరాల్లోకి వెళ్తే రుద్రవరం మండలం పెద్దకంబలూరుకు చెందిన ఓ విద్యార్థిని ఆళ్లగడ్డలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఈనెల 2వ తేదీ ఆ విద్యార్థిని తనకు చూపు సరిగా కనబడడం లేదని ఉపాధ్యాయులకు తెలియజేయడంతో పాఠశాల సిబ్బంది వైద్యపరీక్షలు చేయించి మందులు ఇచ్చి పంపించారు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బాలిక విషయాన్ని తండ్రికి తెలియజేశారు. దీంతో తండ్రి వచ్చి కూతురును ఇంటికి తీసుకువెళ్లాడు. మంగళవారం ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. అక్కడి వైద్యులు వైద్యపరీక్షలు చేయించగా ఆ విద్యార్ధిని గర్భం దాల్చినట్లు గుర్తించారు. వెంటనే కర్నూలు వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించనట్లు తెలిసింది.
మాకు తెలియరాలేదు: ప్రిన్సిపాల్ సుబ్బారావు
విద్యార్థిని గర్భం దాల్చినట్లు తమకు తెలియదని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు అన్నారు. నెలనెల పీరియడ్స్‌కు సంబంధిచిన వస్తువులు క్రమం తప్పకుండా తీసుకుంటూ వుండేదన్నారు. ఈ వివరాలు ఆరోగ్య కార్యకర్త పుస్తకంలోనూ నమోదు చేశారన్నారు. విద్యార్ధిని వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లినపుడు పాఠశాలల్లో వేసవి తరగతులు ఉన్నాయని చెప్పి ఇంటినుంచి బయటకు వచ్చినట్లు తమకు తెలిసిందని సుబ్బారావు అన్నారు. వాస్తవంగా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించలేదన్నారు.