ఆంధ్రప్రదేశ్‌

క్వారీ, గ్రానైట్ యజమానులతో మైనింగ్ అధికారులు చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 6: క్వారీ, గ్రానైట్ యజమానులకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించే దిశగా మైనింగ్ అధికారులు చర్చలు జరిపారు. వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ్ధర్ మంగళవారం ముందుగా గ్రానైట్ సంస్థల యజమానులతో సమావేశమయ్యారు. డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ కింద తమ నుంచి 32 శాతం మేర వసూలు చేస్తున్నారని, దీనిని రద్దు చేయాలని వారు కోరారు. గ్రానైట్‌కు సంబంధించి రా మెటీరియల్‌పై పన్ను చెల్లించాల్సిన బాధ్యత క్వారీ యజమానులదేనని తెలిపారు. కానీ తాము చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. ఫనిష్డ్ ప్రోడక్టుకు మాత్రమే తాము పన్ను చెల్లించాల్సి ఉందని తెలిపారు. తమను వేధింపులకు గురి చేస్తున్న జీవో నెంబర్ 37ను రద్దు చేయాలని కోరారు. అనంతరం క్వారీ యజమానులతో కూడా సమావేశమయ్యారు. క్వారీ, గ్రానైట్ యజమానులు ఇద్దరితో కలిసి మరోసారి సమావేశమయ్యారు. ఈ చర్చలో ఇరు వర్గాలు చేసిన సూచనలను మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.