ఆంధ్రప్రదేశ్‌

డేటా సెంటర్ ఏర్పాటుకు జపాన్ సంస్థ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 6: రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగరంలో ప్రపంచ స్థాయి డేటా సెంటర్‌ను స్థాపించేందుకు జపాన్ సంస్థ ఇంటర్నెట్ ఇన్ఫో వెటివ్ జపాన్ (ఐఐజె) సన్నాహాలు చేస్తోంది. ఈసందర్భంగా మంగళవారం ఉదయం నగరంలో కేదరేశ్వరపేటలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఎడిసి) కార్యాలయంలో చైర్ పర్సన్ డి లక్ష్మీ పార్ధసారథి తో జపాన్ సంస్థ ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ఐఐజె సంస్థ అసిస్టెంట్ మేనేజర్ యూకో కజ్జామ రాజధానిలో ఆధునిక ప్రమాణాలతో నిర్మించనున్న డేటా సెంటర్, దాని అవశ్యకత పై సమీక్షించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్న అమరావతి రాజధాని నగరంగా అభివృద్ధి చేయనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షనీయ నగరాల్లో ఒకటిగా నిలువనున్న నేపథ్యంలో డేటా సెంటర్ పరికరాల ఏర్పాటు నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా తీర్చిదిద్దాలన్నారు. తొలుత రాజధాని నగరంలో పర్యటించిన జపాన్ బృందం అమరావతి భౌగోళిక వైవిధ్యం, సమృద్ధిగా ఉన్న సహజ సిద్దమైన వనరులపై సంతృప్తి వ్యక్తం చేసారు. అనంతరం డేటా సెంటర్ ఏర్పాటు నమూనా, విశేషాలపై ఎడిసి అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసారు. ఈ సమావేశంలో ఎన్‌టిటి టేటా కార్పొరేషన్ జపాన్, భారతదేశంలో జపాన్ అనుబంధ సంస్థ సుమితోమా కార్పొరేషన్, సిజిఎం కజువో యుషిజూకొ, ఎడిసి జనరల్ మేనేజర్ ఎం వెంకటేశ్వరరావు, అర్బన్ ప్లానింగ్ అధికారి కెవి గణేష్‌బాబు, ప్రణాళిక నిపుణులు లవణ్‌కుమార్, ఎంవిపి రావు, సిహెచ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.