ఆంధ్రప్రదేశ్‌

నేడు రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీపై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 6: ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో రాష్ట్రంలోక్రీడలను మరింతగా అభివృద్ధి చేసేందుకు గాను ప్రత్యేక ప్రణాళికను ఏర్పాటు చేయనున్నట్లు శాప్ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగారరాజు తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని శాప్ కార్యాలయంలో విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్రీడా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని, అందరి అభిప్రాయాలు తీసుకోవాలని సిఎం సూచించినట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో బుధవారం డివిమానర్ హోటల్‌లో క్రీడా పాలసీపై చర్చ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర క్రీడాసంఘాలను ఆహ్వానించామని చెప్పారు. సమావేశంలో అందరి అభిప్రాయాలను తీసుకుని 15రోజుల్లో నూతన క్రీడాపాలసీని విడుదల చేస్తామని పేర్కొన్నారు. శాప్ చైర్మన్ పిఆర్ మోహన్ మాట్లాడుతూ 13జిల్లాల్లో యువజన క్రీడావిధానంలో భాగంలో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు, 5ప్రాంతీయ క్రీడాకేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్రీడాశిక్షకులకు నగదు పారితోషికాలు, ప్రతిభ కల క్రీడాకారులను గుర్తించి వేరే ప్రాంతాల్లో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. త్వరలో శాప్‌లో 100మంది కోచ్‌ల నియమకాలు చెప్పట్టనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాసంఘాల వివరాలు పూర్తిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటా వర్తింపచేయనున్నట్లు తెలిపారు. ఈ చర్చ కార్యక్రమానికి కేంద్ర క్రీడా విభాగం అధికారి ఇంజేటి శ్రీనివాస్, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి కె అచ్చెంనాయుడు హాజరవుతారని వివరించారు.