ఆంధ్రప్రదేశ్‌

ప్రజల్లోకి వెళ్లండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించిన భారీ బడ్జెట్ గురించి, ప్రతిపాదించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని రాష్టమ్రంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు టిడిపి శ్రేణులకు వౌఖికంగా ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది. ప్రజలపై ఎలాంటి పన్నులు వేయకుండా బడ్జెట్‌ను ప్రతిపాదించామని, ఈ విషయం మారుమూల గ్రామాల ప్రజలకు కూడా తెలియాలని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, సంక్షేమ పథకాలు తాగునీరు, రోడ్లు తదితర అంశాలకు కేటాయించిన భారీ నిధుల గురించి తొలుత మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుందో తొలుత జిల్లాస్థాయిలో చర్చించి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. 2016-17 సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రతిపాదించిన విషయాన్ని, ప్రణాళికకు పెద్దపీట వేసిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. బుధవారం ముగిసిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా ప్రవర్తన గురించి కూడా జనానికి తెలియచేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు, ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేందుకు వైకాపా ప్రయత్నించే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఈఅంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని టిడిపి శ్రేణులంతా పనిచేయాలని సూచించారని తెలిసింది. గృహనిర్మాణం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రైతురుణ విమోచన, ఉపప్రణాళికలు తదితర అంశాలన్నీ ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిసింది.