ఆంధ్రప్రదేశ్‌

ఇంకో 20 రోజులు.. ఇదే స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: డిసెంబర్ నెల మొదటివారం విజయవంతంగా ముగించాం, మిగిలిన 20 రోజులు ఇదే స్ఫూర్తితో పని చేసి డిమానిటైజేషన్ సమస్యను అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. బ్యాంకర్లు, ఆర్థికశాఖ అధికారులతో ఆయన బుధవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిమానిటైజేషన్ ప్రారంభమై ఇప్పటికి నెల రోజులు అయ్యిందంటూ నగదు రహితంగా రాష్ట్రాన్ని మార్చడంలో ఉత్తీర్ణులు అయ్యామన్నారు. భౌతిక నగదు వినియోగం తగ్గించి, డిజిటల్ నగదు వాడకం పెంచడమే ప్రస్తుత సమస్యకు పరిష్కారంగా మరోసారి గుర్త చేశారు. వచ్చే నెలలో ఈ సమస్య ప్రభావం పూర్తిగా అధిగమిస్తామనే విశ్వాసం ప్రకటించారు. రోటీన్‌గా పని చేస్తే రొటీన్ ఫలితాలు వస్తాయని, ఇన్నోవేటివ్‌గా పని చేస్తేనే మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు. ‘ఏపి పర్స్’ మొబైల్ బ్యాంకింగ్‌కు గేట్ వే లాంటిదంటూ, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ‘మార్పు - నేస్తం’లో పనిచేసే విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు ర్యాంకులు కూడా ఇస్తామన్నారు. విదేశాల్లోలా పార్ట్ టైం పని చేస్తూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలన్నారు. నిరుద్యోగ యువత డిజిటల్ బ్యాంకింగ్ ముమ్మరం చేయడంలో పాలుపంచుకోవాలన్నారు. 100 మందితో లావాదేవీలు చేయిస్తే రూ. 3500 సంపాదించవచ్చని, 200 మందితో చేయిస్తే రూ. 7వేలు వస్తుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. మనవద్ద ఉన్న సాంకేతికతను వినియోగించుకోవాలని, పరిశోధనపై దృష్టి సారించాలని మార్గదర్శకం చేశారు. పరిశోధనలతోనే ప్రస్తుత సమస్యను అధిగమించగలమని తెలిపారు. ‘ఉద్యమ స్ఫూర్తితో పని చేయండి, మార్పును సాధించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. బ్యాంకు కరస్పాండెంట్లు, పంచాయతీ సెక్రటరీలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు డిజిటల్ లిటరసీపై చైతన్య పరచాలన్నారు. రేషన్ సరుకుల పంపిణీ ఈ నెలలో ఇప్పటికే 76 శాతం పంపిణీ చేశామన, పశ్చిమగోదావరి జిల్లాలో 86 శాతం, ప్రకాశం జిల్లాలో 80 శాతం చేశారని కమిషనర్ రాజశేఖర్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో, విజయవాడ రైతుబజార్లలో అనుసరిస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి వివరించారు. రేషన్ పంపిణీలో నగదురహిత లావాదేవీలు 3.68 లక్షలు జరగగా కృష్ణా జిల్లాలోనే 3లక్షలు చేశారని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ మిగిలినవి కూడా వెంటనే పంపిణీ చేయాలన్నారు. ఐదు జిల్లాల్లో ఇంకా పంపిణీ ప్రారంభించలేదంటూ వెంటనే చేపట్టాలన్నారు. అన్ని జిల్లాల్లో సైబర్ సెక్యూరటీ సెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో కూడా సెంట్రల్ సైబర్ సెక్యూరిటీ సెల్‌ను నెలకొల్పి వీటిని సమన్వయం చేసే బాధ్యత ఐటీ శాఖ అధికారులు తీసుకోవాలన్నారు. రెండవ వారం నుంచి ప్రైవేట్ ఉద్యోగుల వేతనాల చెల్లింపు ప్రారంభం అవుతుందంటూ, ఎటువంటి ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను అదేశించారు. అన్ని షాపుల్లో పని చేసే వర్కర్లకు, మిల్లు కార్మికులకు వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా కార్మికశాఖ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల మందికి మొబైల్ బ్యాంకింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చామని, మీరు ఒక్కొక్కరు 200 మందికి శిక్షణ ఇస్తారని సెర్ఫ్ సీఈవో కృష్ణమోహన్ వివరించగా డ్వాక్రా మహిళలకు మొబైల్ బ్యాంకింగ్‌లో శిక్షణను డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశంలో మొదటి నగదు రహిత గ్రామం గురజాత్‌లోని అకోదరను సందర్శించి అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసినట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు వివరించగా ముఖ్యమంత్రి అభినందించారు. వారు పరిశీలించిన అంశాలను వెంటనే నివేదిక రూపంలో అందిస్తే రేపటి ముఖ్యమంత్రుల ఉపసంఘం సమావేశంలో దీనిపై చర్చిస్తామన్నారు. అకోదర తరహాలోనే మన రాష్ట్రంలో కూడా కుటుంబానికి ఒకరు డిజిటల్ లిటరేట్ కావాలన్నారు. ఎప్పటినుంచో దీనిపై తాము ఒత్తిడి చేస్తున్న విషయం గుర్తు చేశారు. కుటుంబానికి ఒకరు డిజిటల్ లిటరేట్ అయితే ప్రస్తుత సమస్యను సులభంగా పరిష్కరించవచ్చన్నారు. ఎంత ఖర్చయ్యింది. ఎంత ఖాతాలో ఉందనే సమాచారం కస్టమర్ల మొబైల్ ఫోన్లకు సందేశం అందేలా బ్యాంకర్లు చూడాలన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు కొత్తమార్పుపై నమ్మకం పెరిగేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఐసిడిసి బ్యాంక్ అకోదరలో అమలు చేస్తున్న నమూనా పరిశీలించాలని సూచించారు. మండలంలో కనీసం ఒక గ్రామాన్ని, పట్టణంలో ఒక వార్డును నగదు రహితంగా మార్చాలని చంద్రబాబు ఆదేశించారు. దీనిపై వివిధ బ్యాంకులు సత్వరమే స్పందించి గ్రామాలు, వార్డుల దత్తత కార్యక్రమం చేపట్టాలన్నారు. దీనిని ఒక సవాల్‌గా తీసుకుని పూర్తి చేయాలన్నారు. అధికార యంత్రాంగం బ్యాంకర్లకు సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వాటి స్ఫూర్తితో మిగిలిన గ్రామాలు, వార్డులు నగదు రహితం అవుతాయని ఆకాంక్షించారు. ఒక దీక్షతో రాష్ట్రాన్ని నగదు రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, అందుకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం చైర్మన్ సాయిబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత, కరికాల వలవన్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ రంగనాథ్, స్టేట్ బ్యాంక్ డిజిఎం టికె రెడ్డి తదితరులు పాల్గొన్నారు.