ఆంధ్రప్రదేశ్‌

మీకు అనుమతి ఇచ్చిందెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తపేట, డిసెంబర్ 8: కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండుతో సత్యాగ్రహ పాదయాత్ర చేయాలని భావిస్తున్న తనను అనుమతి తీసుకోవాలని చెబుతున్న ముఖ్యమంత్రి గతంలో ఆయన విపక్ష నేతగా జరిపిన పాదయాత్రకు ఎవరి నుండి అనుమతి తీసుకున్నారో చెప్పాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోరారు. ఆ అనుమతి పత్రాలు తనకు చూపితే, తాను అదేరీతిలో అనుమతి కోరతానన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. నాడు చంద్రబాబు రోడ్డు మార్జిన్లపై మళ్లీ రోడ్డు వేసుకుని పాదయాత్ర సాగించారని, ఇలా వేసుకోవడానికి ఎవరి అనుమతి కోరారో తెలపాలన్నారు. అలాగే ప్రస్తుత విపక్ష నేత జగన్ పోలవరం పాదయాత్ర చేశారని, షర్మిల ఓదార్పు పాదయాత్ర చేశారని, సిపిఎం, సిపిఐ తరచూ యాత్రలు చేస్తాయని, గడగడపకూ వైసిపి యాత్ర చేశారని, దేశం పార్టీ జనచైతన్య యాత్రలు చేశాయని వాటికి ఎటువంటి అనుమతులు ఇచ్చారో నకలు ఇస్తే పరిశీలిస్తానన్నారు. ఎవరికీ లేని నిబంధనలు తమ జాతికి ఎందుకని ప్రశ్నించారు. కాపులకోసం ప్రత్యేక రాజ్యాంగం రాశారా అని ప్రశ్నించారు. కాపులు పాకిస్తాన్ నుంచో ఇరాన్, ఇరాక్ నుంచో రాలేదని, అనుమతి తీసుకోవాలని ఏ చట్టంలో ఉందో తెలపాలని డిజిపిని కోరానన్నారు. దీనిపై ఇంతవరకూ ముఖ్యమంత్రి సమాధానం చెప్పడంలేదని, దానిపై ఆయన సమాధానాన్ని కోరాలని విలేఖర్లను ముద్రగడ కోరారు. రావులపాలెంలో పాదయాత్రను ఆపినా దానిని చేసి తీరాలని నిర్ణయించినట్లు ముద్రగడ తెలిపారు. ఈ నెల 18న నోటికి రిబ్బను కట్టుకొని గరిటెలు, ప్లేట్లతో చప్పుడు చేయాలని కాపులు ఎక్కడైతే ఉన్నారో ఆయా గ్రామాల్లో మండలాల్లో వీలైనంతసేపు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 30న ప్రజాప్రతినిధులకు నియోజవర్గ ప్రధాన కేంద్రాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. జనవరి 9న రాత్రి 7 గంటలకు కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని నిర్ణయించామన్నారు. జనవరి 25న రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ కాపు సత్యాగ్రహయాత్ర జరుపుతామన్నారు. సత్యాగ్రహయాత్ర అనంతరం ఫిబ్రవరిలో జెఎసి సమావేశమై మరలా ఏవిధమైన కార్యక్రమాలు చేయాలో నిర్ణయిస్తుందన్నారు. ఏదేమైనా ఈ కార్యక్రమం పూర్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాష్ట్రం విడిపోవడంతో ప్రస్తుతం కాపుల ప్రాధాన్యత పెరిగిందని కాపుల ఓట్లు లేనిదే ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాదని గ్రహించిన చంద్రబాబు బిసిలలో చేరుస్తానంటూ నమ్మబలికిన హామీతో అధికారాన్ని దక్కించుకున్నారని ముద్రగడ పేర్కొన్నారు.