ఆంధ్రప్రదేశ్‌

ఇక ప్రీ స్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలో ఉన్న 53 వేల అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లను మార్చనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చెప్పారు. తొలి దశలో 5వేల అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మిస్తామని అన్నారు. 700 చదరపు అడుగల విస్తీర్ణంతో ఈ ప్రీస్కూళ్ల భవనాల నిర్మాణం జరపాలని అన్నారు. ప్రీ స్కూల్ భవనంలోనే మెడికల్ సబ్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, అందులో భవనాలు లేని కేంద్రాలు 9వేల వరకూ ఉన్నాయని అధికారులు చెప్పారు. వీటిలో కనీసం 5వేల కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని సిఎం సూచించారు. రాష్ట్రంలో 13వేల మెడికల్ సబ్ సెంటర్లు ఉండగా 3400 సబ్ సెంటర్లకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయని, మిగిలిన వాటికి లేవని అధికారులు చెప్పారు. మిగిలిన వాటిని ప్రీ స్కూళ్లకు అనుసంథానం చేయాలని సిఎం పేర్కొన్నారు.