ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’ పనులపై విమర్శలు తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 8: అధునాతన యంత్రాలు, అంతర్జాతీయ ఏజెన్సీలతో పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతుంటే, నత్తనడకన జరుగుతున్నాయని ప్రతిపక్షనేత జగన్ విమర్శించడం తగదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గతంలో జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టు పనులు దళారులకు అప్పగించి దోచుకున్నారన్నారు. పోలవరం పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకోవడానికి గతంలో పనులు చేస్తున్న కాంట్రాక్టు ఏజెన్సీలను రద్దుచేయించారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో గురువారం మంత్రి దేవినేని పర్యటించారు. స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ పనులను, కాంక్రీట్ పనుల నిమిత్తం వచ్చిన అధునాతన యంత్రాన్ని పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చి రాతి పరీక్షలు నిర్వహిస్తున్న శాస్తవ్రేత్తల బృందాన్ని కలిసి పరీక్షల వివరాలను ఆయన అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు.ఈ నెల 19వ తేదీన స్పిల్‌వే కాంక్రీటు పనులు ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమానికి కేంద్ర జలనవనరుల శాఖ మంత్రి ఉమాభారతితోపాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు హాజరవుతారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యల కారణంగా పోలవరం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.