ఆంధ్రప్రదేశ్‌

బ్రాండిక్స్ పార్కుకు ప్రభుత్వ సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్యుతాపురం, డిసెంబర్ 8: విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ పార్కుకు ప్రభుత్వం తరఫున మరింత సహకారం అందిస్తామని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. గురువారం బ్రాండిక్స్ పార్కును సందర్శించిన ఆయన మాట్లాడుతూ బ్రాండిక్స్ గార్మెంట్లు ప్రపంచ స్థాయిలో గల బ్రాండ్లకు ఎగుమతి చేయడం చాల ఆనందంగా వుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్న కంపెనీ పనితీరును ఆయన మెచ్చుకున్నారు. 15వేల మంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తున్న కంపెనీ పనితీరు బాగుందన్నారు. పార్కులో రోజుకు రెండు లక్షలపై చిలుకు గార్మెంట్లు ప్రపంచ స్థాయి బ్రాండ్లుకు ఎగుమతి చేస్తున్నట్టు తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.