ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 100 అన్న క్యాంటీన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కడుపు నింపడానికి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 100 అన్న క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభించనున్నారని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ డాక్టర్ పి.సప్తగిరి ప్రసాద్ వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో కూడా ఒక అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో రూ.1కే ఇడ్లీ, రూ.5కి పెరుగన్నం, రూ.5కి పొంగలి, రూ.5కి ఉప్మా, రూ.5కే పులిహోర, రూ.7.50కు సాంబారు అన్నం ఇస్తారన్నారు. రాత్రి పూట రూ.5కు రెండు చపాతీలు ఇస్తారని వివరించారు. ప్రతి రోజూ మూడు పూటలా పేదల కడుపులు నింపడానికి సిఎం చంద్రబాబు నాయుడు క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. క్రిస్మస్, సంక్రాంతిని పురస్కరించుకుని ప్రతి తెల్లరేషన్ కార్డు దారునికి రూ.285 విలువచేసే సరుకులను అందించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు రూ.400 కోట్లు వ్యయం కానుందన్నారు.