ఆంధ్రప్రదేశ్‌

నగరాభివృద్ధిపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 8: నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన వాషింగ్‌టన్ పర్యటన సందర్భంగా ప్రపంచ బ్యాంకు హెడ్ క్వార్టర్స్‌లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమైన కమిషనర్ వీరపాండియన్ నగరంలో చేపట్టిన బహిరంగ మల, మూత్ర విసర్జన, నమ్మా టాయ్‌లెట్స్, స్క్రాబ్ పార్క్, ట్రాన్స్‌ఫార్మింగ్ విజయవాడ కాంపెయిన్, హ్యాపీ సండేస్, స్ట్రీట్ ఫర్నీచర్స్, జాతీయ స్థాయిలో అందిన స్కాచ్ అవార్డ్స్- 2016 లతోపాటు నగరంలోని నదీ కాల్వ గట్ల సుందరీకరణ తదితర అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసిన వివరించారు. కమిషనర్ ఆఫ్ బోపాల్, చావి బరద్వాజ్, ఎంఓయుడి చీఫ్ అకౌంట్స్ కంట్రోలర్ శ్యామ్ దుబే తదితరులు పాల్గొన్నారు.