ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్యశ్రీపై చర్చకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 8: వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరోగ్యశ్రీపై చర్చకు సిద్ధమని ప్రకటించారని, ఈ విషయంపై బహిరంగ చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, సమయం, తేదీ చెబితే వస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో ముడుపులు రానందునే ప్రభుత్వం ఈ పథకం అమలు పట్ల నిరాసక్తత ప్రదర్శిస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదలకు వైద్యసేవలు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. పట్టిసీమకు అదనంగా నిధులు కేటాయించిన ప్రభుత్వం వైద్యారోగ్యశాఖ ఆరోగ్యశ్రీకి 910 కోట్లు కేటాయించాలని కోరితే 568 కోట్లు కేటాయించారని, వీటిలో 398 కోట్లు బకాయిలే ఉన్నాయన్నారు. జగన్ ఆరోగ్యశ్రీ అమలుపై బహిరంగ లేఖ రాయగా ఈనెల 4న 262 కోట్లు అదనంగా కేటాయించారన్నారు. జగన్ ప్రజా సమస్యలపై స్పందిస్తే అవగాహన లేదంటూ మంత్రులు సమస్యలపై మాట్లాడకుండా వేరే అంశాలపై మాట్లాడుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేయాలని శనివారం రాష్టవ్య్రాప్తంగా అన్ని కలెక్టరేట్‌ల ఎదుట వైసిపి ధర్నా చేపడుతుందన్నారు.