ఆంధ్రప్రదేశ్‌

అంతా వాళ్ల మనుషులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్‌పురం/కూనవరం/చింతూరు, డిసెంబర్ 8: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కాంట్రాక్టర్లు, సబ్-కాంట్రాక్టర్ల కోసమే నిర్మాణ వ్యయం అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. రూ.16వేల కోట్ల అంచనా వ్యయంగా నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయాన్ని తాజాగా రూ.36వేల కోట్లకు పెంచేశారన్నారు. డీజిల్, పెట్రోలు, ఇసుక, సిమెంటు, స్టీలు ధరలు తగ్గుముఖం పడుతుంటే అంచనా వ్యయం ఎలా పెరుగుతుందని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల బంధువు ఒకరు ఈ ప్రాజెక్టుకు సబ్-కాంట్రాక్టరుగా ఉన్నారని,
ఇలాంటి వారికి మేలు చేకూర్చడానికే వ్యయం పెంచేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన పోలవరం ముంపు మండలాలు ఎటపాక, కూనవరం, విఆర్‌పురం మండలాల్లో గురువారం జగన్ పర్యటించారు. విఆర్‌పురం మండలం రేఖపల్లిలో గురువారం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములివ్వడానికి సిద్ధపడిన వారికి ఒక్కో ప్రాంతంలో ఒక్కోరీతిన పరిహారం ఇవ్వడం అమానుషమన్నారు. అందరికంటే ముందుగా భూములివ్వడానికి అంగీకరించిన వారికి ఎకరాకు రూ.1.5 లక్షలు మాత్రమే పరిహారం చెల్లించారని, కొన్ని ప్రాంతాల్లో రూ.12 లక్షలు, పట్టిసీమ ప్రాంతంలో రూ.19 లక్షలు చెల్లించారన్నారు. పరిహారంలో ఇంత వ్యత్యాసం దారుణమన్నారు. రాష్ట్రం మొత్తం బహిరంగ మలవిసర్జన రహితంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఏజెన్సీలోని గిరిజన హాస్టళ్లలో మరుగుదొడ్లు లేక చెంబులతో కొండలపైకి వెళుతున్న విద్యార్థులు కనిపించడంలేదా అని జగన్ ప్రశ్నించారు. ఈసందర్భంగా విఆర్ పురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని సుభాషిణి మాట్లాడుతూ తమ పాఠశాలలో 22మంది ఉపాధ్యాయులకుగాను ప్రస్తుతం 8మంది మాత్రమే ఉన్నారని, దీనివల్ల బోధన సక్రమంగా జరగడం లేదని జగన్ దృష్టికి తీసుకొచ్చింది. ముంపు ప్రాంతాలైనా సరే ముంచే వరకూ విద్యనందించాలని కోరింది.
జగన్ మాట్లాడుతూ ఈ చిన్నారి ఆవేదన సిఎంకి వినపడి బుద్ధి వస్తుందేమో చూద్దామన్నారు. తొలుత చింతూరు చేరుకున్న జగన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను కలుసుకుని కళాశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మామిళ్లగూడెంలో కాళ్ల వాపు వ్యాధితో మృతిచెందిన ముచ్చిక లక్ష్మయ్య, ముచ్చిక సీతారామయ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. వైసిపి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోసు, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైసిపి జిల్లా యువజన అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ తదితరులున్నారు.

చిత్రం..బహిరంగ సభలో సమస్యలు చెబుతున్న
విద్యార్థిని సుభాషిణితో మాట్లాడుతున్న జగన్