ఆంధ్రప్రదేశ్‌

వివాదంలేని ఆస్తులు 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: అక్షయ గోల్డ్ కేసుకు సంబంధించి 17 ఆస్తులు వివాదంలేనివని, వీటిని విక్రయించి వచ్చిన సొమ్ముతో డిపాజిట్‌దార్లకు సొమ్ము చెల్లించగలమని ఆంధ్ర సిఐడి అధికారులు హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు ధర్మాసనానికి సిఐడి 17 ఆస్తుల వివరాలను శుక్రవారం అందించింది. ఈ కేసులో పిటిషనర్ కూడా వివాదం లేని ఆస్తులు 7 ఉన్నాయని హైకోర్టుకు జాబితా ఇచ్చారు. అనంతరం హైకోర్టు పరిశీలించి వివాదం లేని ఆస్తులు 22 ఉన్నట్లు గుర్తించింది. ఈ కేసువిచారణను జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అనంతరం అక్షయ గోల్డ్ కేసును కోర్టు విచారించింది. సిఐడి తరఫున న్యాయవాది కె కృష్ణప్రకాశ్ వాదనలు వినిపిస్తూ, ఆస్తుల వేలం ప్రక్రియకు మరింత గడువు కావాలని, ఈ ఆస్తుల వేలానికి 20 మంది అధికారులు పనిని ప్రారంభించారన్నారు.