ఆంధ్రప్రదేశ్‌

దేశంలో రెండో ఉత్తమ డిస్కాంగా ‘ఈస్టర్న్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: దేశం మొత్తం మీద పనితీరు బాగా కనపరిచిన రెండు అత్యుత్తమ విద్యుత్ డిస్కాంలలో ఆంధ్ర రాష్ట్రంలోని ఈస్టర్న్ పవర్ డిస్కాం ఒకటని కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. ఇంధన పొదుపు కార్యక్రమం, గృహ విద్యుద్ధీకరణలో వంద శాతం ఫలితాలను సాధించినందుకు ఈ అవార్డు లభించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల్లో విద్యుత్ రంగంలో అమలు చేసిన వివిధ పథకాల వల్ల ఈస్టర్న్ పవర్ డిస్కాం అత్యుత్తమ స్థానానికి ఎంపికైందని స్వాగతించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ సాధించామన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేస్తున్నామన్నారు. విద్యుత్ అంతరాయాలు లేని రాష్ట్రంగా ఏపి అవతరించిందన్నారు. తిరుపతిలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దేశం మొత్తం మీద నాల్గవ స్థానంలో నిలిచిందన్నారు. ఈస్టర్న్ పవర్ డిస్కాంలో 16434 ఎంయు విద్యుత్ అవసరమైతే, 13422 ఎంయు విద్యుత్ విక్రయాలు జరిగాయని, 2112 ఎంయు విద్యుత్‌ను వ్యవసాయానికి ఉచితంగా సరఫరా చేశామన్నారు. విద్యుత్ అమ్మకాల్లో 94.52 శాతం, మీటర్ట్ అమ్మకాలు 81.67 శాతం, డిస్కాం నష్టాలు 5.48 శాతం నమోదైందన్నారు. కాగా రెవెన్యూ వసూళ్ల సామర్థ్యం 100.39 శాతం సాధించామని చంద్రబాబు పేర్కొన్నారు.