ఆంధ్రప్రదేశ్‌

రామానుజన్ గణిత అకాడమి జాతీయ స్థాయి పోటీల విజేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 12: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలోని రామానుజన్ గణిత అకాడమి నిర్వహించిన 27వ జాతీయ స్థాయి గణిత పోటీలలో విజేతల వివరాలను సోమవారం అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు కెవివి సత్యనారాయణ, ఎగ్జామ్ సెల్ నిర్వాహకుడు కె శ్రీకృష్ణసాయి, ఎం నాగార్జున విడుదల చేశారు. 4వ తరగతి విభాగంలో కరీంనగర్‌కు చెందిన వి సంజీతరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన ఎం మోక్షితరెడ్డి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 5వ తరగతి విభాగంలో కడపకు చెందిన కె కీర్తిప్రియ, కొత్తపేట విద్యార్థిని వి హరిచందన ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 6వ తరగతి విభాగంలో గుంటూరు విద్యార్థులు పివి మణీంధర్‌రెడ్డి, ఎం సాయిగోవర్ధనరావు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 7వ తరగతి విభాగంలో గుంటూరుకు చెందిన గ్రంధి జీవన్ నాగసాయికృష్ణ ప్రథమ స్థానం సాధించగా, అదే పాఠశాలకు చెందిన షైనిక కుందూరు, హర్ధిక రామినేని ద్వితీయ స్థానం సాధించారు. 8వ తరగతి విభాగంలో గుంటూరుకు చెందిన ఉండవిల్లి సుజిత ప్రథమ స్థానం, అదే విద్యా సంస్థకు చెందిన గుంటుపల్లి ఆశిష్ సాయి, చల్లా సుష్మలు ద్వితీయ స్థానాలు సాధించారు. 9వ తరగతి విభాగంలో ప్రథమ స్థానాన్ని గుంటూరుకు చెందిన పి సుజిత, ఎ తారకరామ్‌లు సాధించగా, రాజమహేంద్రవరం విద్యార్థి లారా ప్రభాకర్, గుడివాడకు చెందిన కె దీపక్‌సాయి, సిహెచ్‌ఎల్‌ఎన్ నాయుడు ద్వితీయ స్థానంలో నిలిచారు. 10వ తరగతి విభాగంలో గుడివాడకు చెందిన ఎస్ హర్షవర్ధన్ ప్రథమ స్థానం సాధించగా, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 10 మంది ద్వితీయ స్థానాలు సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం స్థాయిలో జగ్గయ్యపేట జూనియర్ కళాశాల విద్యార్థులు జి నవీన్, ఎ మణికంఠ వరుస స్థానాలు సాధించారు. ద్వితీయ సంవత్సరం విభాగంలో పాయకరావుపేట శ్రీప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎపిఎస్ మణిదీప్, అంకిత్ జైన్‌లు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. ఈ నెల 18వ తేదీ ఆదివారం రామచంద్రపురంలో విజేతలకు బహుమతి ప్రదానం చేయనున్నట్లు అకాడమి వ్యవస్థాపక అధ్యక్షులు కెవివి సత్యనారాయణ తెలిపారు.