ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రాలో ఫిన్లాండ్ విద్యావిధానం అధ్యయనానికి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిన్లాండ్ విద్యావిధానాన్ని అమలుచేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫిన్లాండ్ విద్యావిధానం అమలు అధ్యయనానికి ఒక కమిటీని కూడా నియమించింది. ఉపాధ్యాయ విద్య పారదర్శకత కోసం కమిటీని నియమించారు. నిబంధనలకు అనుగుణంగా ఎయిడెడ్ టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రంలో సరిపడా డిఎడ్, బిఇడి కళాశాలలు ఉన్న నేపథ్యంలో తదుపరి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన వచ్చే వరకూ ఇక నుండి కొత్తగా బిఇడి, డిఎడ్ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వవద్దని జాతీయ ఉపాధ్యాయ శిక్షణా మండలి , కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖను ప్రభుత్వం కోరింది. మరో పక్క ఎయిడెడ్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను గుర్తించి క్రమపద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జనవరి 3వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు.
అప్‌గ్రెడేషన్
హిందీ పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ జిల్లాల వారీ కేటాయింపులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1450 లాంగ్వేజి పండిట్లను స్కూల్ అసిస్టెంట్లుగా, 1200 పిఇటి పోస్టులను ఫిజికల్ డైరెక్టర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయించింది.