ఆంధ్రప్రదేశ్‌

ఖాతాదారునిపై ఎస్‌ఐ జులుం ..తిరగబడ్డ మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, డిసెంబర్ 13: అసలే నోట్ల కష్టాలు.. ఆపై బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలు... ఇంతలో నో క్యాష్ అని బ్యాంక్ మేనేజర్ చెప్పడంతో సహనం కోల్పోయిన మహిళలు తిరగబడ్డారు. సర్దిచెప్పపోయిన ఎస్‌ఐని అడ్డుకున్నారు. దీంతో ఎస్‌ఐ ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడంతో మహిళలు ఆవేశంతో ఎస్‌ఐపై పడి గోళ్లతో రక్కేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మూడురోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం బ్యాంకులు తెరుచుకున్నాయి. కర్నూలు జిల్లా కొత్తపల్లి లోని ఎస్‌బిఐ వద్ద ఉదయం నుంచే జనం పెద్దసంఖ్యలో నగదు కోసం క్యూలో నిలుచున్నారు. బ్యాంకు తెరిచిన కొద్దిసేపటికే మేనేజర్ కిరణ్‌కుమార్ బయటకు వచ్చి డబ్బులు లేవని చెప్పడంతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనితో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న కొత్తపల్లె ఎస్‌ఐ శివశంకర్‌నాయక్ జనానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా జనాలు వినిపించుకోకపోవడంతో సహనం కోల్పోయిన ఎస్‌ఐ గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన రాముడుపై చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నగదు ఇప్పించకపోగా క్యూలో నిలుచున్న వారిపైనే దాడి చేస్తారా అంటూ మహిళలు ఆగ్రహంతో ఊగిపోతూ ఎస్‌ఐ దాడికి దిగారు. గోళ్లతో మొఖంపై రక్కడంతో ఎస్‌ఐ కిందపడిపోయారు. కిందపడ్డ ఎస్‌ఐని రక్షించి బ్యాంకులోకి తీసుకువెళ్లారు.