ఆంధ్రప్రదేశ్‌

బాధ్యతతో పనిచేస్తేనే విశ్వసనీయత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 14: ప్రభుత్వ అధికారులు, బ్యాంకు సిబ్బంది బాధ్యతాయుతమైన పనితీరుతో ప్రజల్లో విశ్వాసం పొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బ్యాంకర్లు, జిల్లా కలెక్టర్లు, ఆర్థికశాఖ అధికారులతో బుధవారం తన నివాసం నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు పెంచడంలో ప్రతి ఒక్కరూ యథాశక్తి సహకరించాలని కోరారు. బ్యాంకులు, ఎటిఎంల వద్ద రద్దీ పెరిగిందంటే పనితీరులో లోపం ఉన్నట్లుగా భావించాల్సి వస్తుందన్నారు. ఏ ఒక్క వృద్ధుడు, వికలాంగుడు బ్యాంకుల వద్ద క్యూలో నిలబడకుండా చూడాలని ఆదేశించారు. కుర్చీలు, టెంట్లు వేయాలని వారికి తగిన వసతులు కల్పించాలని సూచించారు. రేపటి నుంచి ప్రతి రేషన్ డిపో బిజినెస్ కరెస్పాండెంట్‌గా పనిచేయాలన్నారు. ఒక్కో రేషన్ దుకాణం ద్వారా కనీసం రూ. 2లక్షల నగదు పంపిణీ జరిగితే గ్రామాల్లో నగదు లభ్యత పెరుగుతుందని, నగదు చలామణి పెరిగితే చాలావరకు సమస్య పరిష్కారమైనట్టే అన్నారు. జనధన్ ఖాతాల వినియోగం ప్రస్తుతం 16 శాతం మాత్రమే ఉందని, దీనిని కనీసం 30 శాతానికి పెంచాలన్నారు. మొబైల్ లావాదేవీలు ప్రస్తుతం ఉన్న 8 నుంచి 25 శాతానికి పెరగాలన్నారు. రాష్ట్రంలో అన్నిరకాల నగదురహిత లావాదేవీలు 50 నుంచి 75 శాతం జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని రూపే కార్డుల పంపిణీ నాలుగురోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. ఖాతాదారులను గుర్తించడంలో బ్యాంకర్లకు వెలుగుసిబ్బంది, సెర్ప్, మెప్మా సిబ్బంది సహకరించాలన్నారు. అన్ని వ్యాపారాలలో ఈపోస్, ఎంపోస్ మిషన్ల వినియోగం పెరగాలన్నారు. ఆర్టీసి బస్సులు, సినిమా థియేటర్లలో ఎంపోస్ మిషన్లు వినియోగించాలని సూచించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో ఆర్బీఐ అధికారుల సమావేశం వివరాలను ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ రంగనాథ్ వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షా 20 వేల కోట్ల నగదు డిపాజిట్లు కాగా, 32వేల కోట్ల కొత్త నగదును పంపిణీ చేసినట్లుగా ఆర్బీఐ అధికారులు కేంద్రమంత్రికి వివరించారని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ రానున్న మూడురోజుల్లో మరింత నగదు రాష్ట్రానికి రానున్నదన్నారు. తుపాను ప్రభావిత జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో 500 కోట్ల నగదు పంపిణీ చేయాలని సూచించారు.