ఆంధ్రప్రదేశ్‌

వృద్ధిరేటులో రాష్ట్రం నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 15: వృద్ధిరేటులో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అత్యున్నత స్థానానికి చేరేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో గురువారం సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరానికి 16.42 వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామని, వర్షపాతం తక్కువగా నమోదు కావడం, రాష్ట్ర విభజన సమస్యల కారణంగా 12.23 శాతం వృద్ధినే సాధించగలిగామని తెలిపారు. అయితే దేశ వృద్ధిరేటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు 5శాతం అధికంగా ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రెండో అర్ధ సంవత్సరంలో నిర్దేశించుకున్న 14.41 శాతం వృద్ధిరేటును నూరుశాతం సాధించేలా పటిష్ఠ కార్యాచరణ అమలుచేయాల్సి ఉందన్నారు. వృద్ధిరేటులో రాష్ట్రం ఎప్పుడూ దేశ వృద్ధిరేటు కన్నా రెట్టింపు శాతాన్ని సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. వృద్ధిరేటు, లక్ష్యాల సాధనకు సంబంధించిన ఫలితాలు, వివరాలు అందరికీ తెలియాల్సి ఉందని, అందుకే అర్ధ సంవత్సర ఫలితాలపై ప్రత్యేకంగా చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. 2016-17 మొదటి అర్ధ సంవత్సరాన వ్యవసాయం రంగం 23.19 శాతానికి గాను 24.44, పరిశ్రమలు 16.41కి 9.98 శాతం, సేవల రంగంలో 14.28 శాతానికి 9.57 శాతం చొప్పున వృద్ధి సాధించినట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ఇంధన వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వివరించగా ఈ రంగంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని, ఇది మిగిలిన శాఖలకు ఆదర్శం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపినందుకు పరిశ్రమల శాఖ అధికారులను అభినందించారు. వర్షపాతం తగ్గినా వ్యవసాయ రంగంలో ఆశాజనక ఫలితాలు వచ్చాయని, దూరదృష్టితో నీటి నిర్వహణ సమర్థవంతంగా చేపట్టినందునే ఇది సాధ్యమైందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరింత వృద్ధికి ఆస్కారం ఉందన్నారు. ఆక్వారంగం ఈవిషయంలో ముందుందని, ఇదే వేగంతో పురోగతి సాధిస్తే మన ఆక్వా రంగం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమన్నారు. తక్కువ బడ్జెట్ కేటాయింపు జరిపినా సమర్థత ఉంటే ఎక్కువ ఫలితాలు సాధించవచ్చని ఆక్వా రంగం నిరూపించిందన్నారు. జీవనభద్రత నుంచి ఆదాయ భద్రత వరకు కుటుంబ వికాసం కోసం నిర్దేశించుకున్న 15 సూత్రాలను, సమాజ వికాసం కోసం అమలుచేస్తున్న 10 సూత్రాలను, స్థిరమైన అభివృద్ధికి ఎంచుకున్న 17 లక్ష్యాలను అందరూ దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతి కుటుంబం కనీసం నెలకు రూ.10వేలు ఆర్జించేలా చూడాలని, పౌరసేవల్లోనూ మేటిగా ఉండాలన్నారు. ప్రజల సంతృప్తే పరమావధిగా పనిచేయాలన్న ముఖ్యమంత్రి విశాఖలో ఇంటి స్థలాల క్రమబద్ధీకరణతో వచ్చిన సానుకూల స్పందనను ఈసందర్భంగా ప్రస్తావించారు. సుమారు 30వేల కుటుంబాలకు రూ.4వేల కోట్ల నుంచి 5వేల కోట్ల రూపాయల విలువైన ఇంటి జాగాలు క్రమబద్ధీకరించారని, ఈ కార్యక్రమంలో ఎక్కడా అక్రమాలు, అవినీతికి తావులేకుండా చేయగలిగామన్నారు. ఇన్ని వేల కుటుంబాల్లో సంతోషం నింపడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. దేశంలో మరెక్కడా లేనంతగా పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం, పెద్దఎత్తున గృహ నిర్మాణాలు, సిసిరోడ్ల నిర్మాణాలు చేపట్టడంతో రాష్ట్రంలో నిర్మాణ రంగ పరిశ్రమ బాగుందని, ఇది ఎంతోమంది ఉపాధికి దోహదపడుతుందని తెలిపారు. ఎర్రచందనం విక్రయం, టూరిజం అభివృద్ధి ద్వారా మరింత ఆర్జన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, డిజిపి సాంబశివరావు, ఆయా శాఖల మంత్రులు పాల్గొన్నారు.