ఆంధ్రప్రదేశ్‌

నోట్ల కోసం అగచాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 15: అనంతపురం జిల్లాపై పెద్దనోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, సామాన్య, మధ్యతరగతి ప్రజల నోట్లు లభించక, చేతిలో చిల్లిగవ్వ లేక సతమతమవుతున్నారు. నగదు కోసం ప్రతిరోజు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. పనులన్నీ వదులుకుని బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్నా రూ,2 వేలు, రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నారు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం ఈనెల 3వ తేదీ వరకు దశల వారీగా జిల్లాకు ఆర్‌బిఐ నుంచి కేవలం రూ.490 కోట్ల కొత్త నోట్లు మాత్రమే వచ్చాయి. ప్రారంభంలో రూ.240 కోట్లు, తర్వాత రూ.160 కోట్లు, ఇటీవల రూ.90 కోట్లు జిల్లాకు వచ్చాయి. కొన్ని బ్యాంకులకు రూ.కోటికి మించి ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు శాఖలకు పంపిణీ చేయాలంటే రూ.20 లక్షల లోపే కొత్త కరెన్సీ అందుతోందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, కో-ఆపరేటివ్ బ్యాంకులకు నగదు భారీగా అందిస్తున్నా, జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా ఆయా బ్రాంచ్‌లు ఉండటంతో కనీసం రూ.లక్ష కూడా పంపిణీ కావడం లేదు.