ఆంధ్రప్రదేశ్‌

హడలెత్తిస్తున్న కడలి కోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 15: రోజు రోజుకు పెరుగుతున్న కోతతో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని సముద్ర తీర గ్రామాలు వణికిపోతున్నాయి. తుపాను సమయంలో కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉండటం అనంతరం యథాస్థితికి చేరుకోవడం ఆ గ్రామాల వాసులకు నిత్యకృత్యమే. అయితే గత కొన్ని నెలలుగా కెరటాల ఉద్ధృతికి తీరం కోతకు గురవుతోంది. తీరంలోని కొబ్బరి తదితర తోటలు నెమ్మది నెమ్మదిగా కడలి ఒడిలో కలిసిపోతున్నాయి. దీంతో సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తీర గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. ఆహ్లాదకర వాతావరణంతో ఉండే ఈ తీర ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉంటుంది. గడిచిన యాభై ఏళ్ళుగా ఎన్ని తుపాన్లు వచ్చినా ఈ ప్రాంతం ప్రశాంతంగానే ఉంది. అందుకే పశ్చిమ తీర ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా పిలుస్తారు. అటువంటి ఈ ప్రాంతం తొలిసారి 2004లో సునామీ మృత్యుఘంటికలను చవిచూసింది. అప్పటి నుంచి తుపాన్లు వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రాంతం కోతకుగురవ్వడం ప్రారంభమయ్యింది. తొలుత నరసాపురం నియోజకవర్గం పరధిలోని ఉన్న పెదమైనవానిలంక, చినమైనవానిలంక గ్రామాల్లో ఈ కోత చాలా స్పష్టంగా కనిపించింది. తూర్పు గోదావరి జిల్లా-పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల్లోని కెరటాలు అంతర్వేదిని తాకి పెదమైనవానిలంకకు వైపు పయనించి కోతకు కారణమవుతున్నాయి. ఇటీవలి వార్ధా తుపాను ప్రభావం జిల్లాపై లేకున్నా, మొగల్తూరు మండలం పేరుపాలెం వద్ద తీరప్రాంతం భారీగా కోతకు గురయ్యింది. సుమారు 200 నుంచి 300 వరకు తాటి, కొబ్బరి చెట్లు కోతకు నేలకూలాయి. పెదమైనవాని లంక, చినమైనవాని లంక, కెపిపాలెం, పేరుపాలెం, మోళ్ళపర్రు వంటి ప్రాంతాల్లో సముద్రం కోత ప్రభావం ఎక్కువగావుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే ఈ గ్రామాల ప్రజలు ముందుజాగ్రత్తగా వలసబాట పట్టాలనే యోచనలో ఉన్నారు. జిల్లాలోని 19 కిలో మీటర్లు ఉన్న తీర ప్రాంతంలోని దాదాపుగా 10 కిలోమీటర్ల పరిధిలో కోత సమస్య ఎదురవుతోంది. పెదమైనవానిలంక, తూర్పుతాళ్ళు గ్రామాలను దత్తతతీసుకున్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోతపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల పర్యటనకు వచ్చిన సమయంలో స్థానికులు కోత సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కోతపై ఒక బృందం కూడా వచ్చి అధ్యయనం చేసింది. కోతకు గురైన ప్రాంతాల్లో అడ్డుగా గోడ నిర్మాణం అసాధ్యమని తేల్చింది. ముంబై తరహాలో త్రిముఖ పద్దతిలో రాళ్ళను ఏర్పాటుచేస్తే కోతను నివారించవచ్చునని అభిప్రాయపడింది. కాని ఆ తర్వాత దాని ఊసేలేదు.

చిత్రాలు..మొగల్తూరు మండలం కెపిపాలెంలో కోతకు గురవుతున్న భూమి

మొగల్తూరు మండలం పేరుపాలెం తీరంలో కెరటాల కోతకు పడిపోతున్న కొబ్బరి చెట్లు