ఆంధ్రప్రదేశ్‌

సముద్రంలో తొమ్మిది మంది మత్స్యకారులు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాకాడు, డిసెంబర్ 16: బంగాళాఖాతం సముద్రంలో చేపలవేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతైన తొమ్మిది మందిలో ఇద్దరు నెల్లూరు జిల్లావాసులు. ఏడుగురు చెన్నైకు దగ్గరలోని కాశినేడుకు చెందినవారని తెలిసింది. సేకరించిన సమాచారం మేరకు గత నెల 26వ తేదీన నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగరాజుపట్నం పరిధిలోని అంజనాపురం గ్రామానికి చెందిన వెంకటరమణయ్య, మైపాడు గ్రామానికి చెందిన మల్లికార్జున కలిసి కాశినేడులోని ఏడుగురు మత్స్యకారులతో బోటులో చేపలవేటకు వెళ్లారు. గత సోమవారం వార్ధా తుఫాన్ సంభవించడంతో వారి కోసం వారి బంధువులు ఫోన్ చేయగా, ఎటువంటి సమాధానం రాకపోవడంతో అంజనీపురం గ్రామానికి చెందిన వెంకటరమణ బంధువులు కాశినేడుకు వెళ్లి విచారించగా ఆ బోటులో వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు జాడ తెలియ టం లేదని తెలిపారని అన్నారు. వెంటనే సముద్రతీర ప్రాంతమంతా గాలించడంతోపాటు మెరైన్, కోస్టుగార్డులకు ఫిర్యాదు చేసినప్పటికీ శుక్రవారం ఉదయం వరకు వారి ఆచూకీ లభ్యం కాలేదన్నారు. జిపిఎస్ తదితర పరికరాలు బోటు ఆచూకీ తెలియలేదని, తుఫాన్ ప్రభావంతో సముద్రంలో ఆటుపోటులు ఉద్ధృతంగా ఉండటం వలన వీరు ప్రమాదానికి గురై ఉంటారని మెరైన్, కోర్టుగార్డులు తెలిపారు. ఇంటి నుండి వెళ్లి నేటికి 20 రోజులు అవుతున్నా వారు ఆచూకీ లభ్యం కాకపోవడంపై బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు.