ఆంధ్రప్రదేశ్‌

తప్పు చేశాడు..తీసేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 16: తమిళనాడుకు చెందిన శేఖర్‌రెడ్డికి ఎవరో సిఫార్సు చేస్తే టిటిడి ధర్మకర్త మండలిలో సభ్యుడుగా స్థానం కల్పించామని, తప్పు చేయడంతో తీసేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం తిరుపతిలో బర్డు ఆసుపత్రి ఓపి బ్లాక్, నూతన ఆపరేషన్ థియోటర్, సిమ్స్‌లో మహిళా వైద్య కళాశాల నూతన భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఆయన జనవరి 3 నుండి జరగనున్న ‘ఇస్కా’ ఏర్పాట్లపై ఎస్‌వియులో ఆయన అనుచరులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. శేఖర్‌రెడ్డి అంశాన్ని విలేఖరులు సిఎం ముందు ప్రస్తావించినప్పుడు ఎవరో సిఫార్సు చేస్తే టిటిడి బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించామని, తప్పు చేశాడని తేలడంతో తక్షణం పదవినుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. సమాజంలో అనేక పొరపాట్లు జరుగుతుంటాయని, తప్పులు తెలుసుకున్నప్పుడు సరిదిద్దుకోవాలన్నారు. మీ మీడియాలో కూడా అనేక తప్పులు జరుగుతుంటాయి కదా అని ఆయన నవ్వుకుంటూ అన్నారు.