రాష్ట్రీయం

పెట్టుబడులతో రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: ఫార్మా రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్న ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న 68వ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌లో రెండో రోజు శనివారం నాటి సాంకేతిక చర్చా కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ అపారమైన వనరులు, నిరంతర విద్యుత్, అనువైన భూములు, ఆధునిక రవాణా వ్యవస్థలతోపాటు విశేషమైన మానవవనరులు మెండుగా ఉన్న నవ్యాంధ్రలో ఫార్మా రంగం అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ ఔషధ పరిశోధన, తయారీ, వాణిజ్య రంగాలకు ఎంతో అనుకూలమన్నారు. ఇప్పటికే అనేక ఫార్మా కంపెనీలను విశాఖలో నెలకొల్పారని, మరిన్ని కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. గుజరాత్ తర్వాత నవ్యాంధ్రలోనే ఫార్మా రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. విశాఖలో మెడ్‌టెక్ పార్కును ఏర్పాటు చేసుకుంటున్నామని, దీనికి అనుగుణంగా మరిన్ని ఫార్మా కంపెనీలు ఏర్పాటైతే విశాఖ ఫార్మా హబ్‌గా రూపుదిద్దుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.4 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన 400 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఇప్పటికే 60 శాతం పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైందన్నారు. భారత రిజర్వ్ బ్యాంకు నివేదిక మేరకు 100 శాతం పెట్టుబడుల్లో ఎపి 16 శాతం పెట్టుబడులను ఆకర్షించి అగ్రస్థానంలో నిలిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో మూడు ప్రత్యేక అర్థిక మండళ్లు ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని, దీనిలో ఒకటి నవ్యాంధ్రకు కేటాయించారన్నారు. అంతకుముందు సిఎం చంద్రబాబు బి ఫార్మసీ కోర్సుకు సంబంధించిన సిడిని, పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్‌వి వీరమణి, నిర్వాహక కమిటీ అధ్యక్షుడు రావ్ విఎస్‌వి వడ్లమూడి తదితరులు పాల్గొన్నారు.
ఫార్మా హబ్‌గా నవ్యాంధ్ర
నవ్యాంధ్రను ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 68వ ఐపిసి -2016లో పాల్గొన్న అనంతరం ఆయన ప్రముఖ ఔషధ కంపెనీల సిఇఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మెడ్‌పార్క్, మెడ్‌టెక్ పార్క్, ఫార్మా పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో ఎక్కడైనా తమ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలనుంచి హాజరైన ప్రతినిధులకు ఆయన ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పలువురు ఫార్మా కంపెనీల యజమానులు థర్డ్ పార్టీ విచారణ అంశాన్ని సిఎం వద్ద ప్రస్తావించారు. ఈ విషయం కేంద్రం పరిధిలోనిదని, ఇప్పటికే కేంద్ర మంత్రి అనంతకుమార్ పరిశీలనలో ఉందని వివరణనిచ్చారు. ఎపిలో వాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసియా బయోటెక్ కంపెనీ ప్రతినిధి కోరగా, సిఎం సానుకూలంగా స్పందించారు. చెన్నైకి చెందిన ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమకు దగ్గరగా ఫార్మా పార్క్‌ను ఏర్పాటు చేయాలని కోరగా, కృష్ణపట్నం - తడ మధ్యలో దీన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

చిత్రం..విశాఖలో శనివారం జరిగిన ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌లో బి-్ఫర్మసీ కోర్సుకు సంబంధించిన సిడి, పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు