ఆంధ్రప్రదేశ్‌

కేంద్రమే నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 18: పోలవరం ప్రాజెక్టుపై జాతీయ స్థాయి పోరాటానికి నిర్వాసితులంతా సన్నద్ధం కావాలని రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాలులో ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఆర్థిక, రాజకీయ విశే్లషకుడు పెంటపాటి పుల్లారావు అధ్యక్షతన పోలవరం నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిస్తే మీరు ప్రతీదానికి అడ్డుపడుతుంటారని తమను ఎద్దేవా చేశారన్నారు. నిర్వాసితుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకోసం త్యాగాలు చేసిన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నూటికి నూరు శాతం నిధులను కేంద్రమే ఇస్తుంది కాబట్టి నిర్వాసితులకు నూటికి నూరుశాతం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి నిర్వాసితులకే ఇచ్చేస్తే ఇక ప్రాజెక్టు ఎలా కడతామని చంద్రబాబునాయుడు తమతో వాధించారని, అందుకే పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి జాతీయస్థాయిలోనే పరిష్కారం కావాలి కాబట్టి కేంద్రంతోనే పోరాటం సాగించి ఢిల్లీలో తాడేపేడో తేల్చుకుందామన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల సమయంలో మార్చి మొదటి వారంలో పార్లమెంట్‌కు వెళ్లి నిర్వాసితుల సమస్యను పరిష్కరించేంత వరకు ఢిల్లీలోనే భీష్మించుకుని కూర్చుందామని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈమేరకు సమావేశంలో తీర్మానం చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకూడదని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేతికి డబ్బులివ్వకుండా కేంద్రమే నిర్మాణ పనులు చేపట్టి, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. చిట్ట చివరి బాధితుడికి పరిహారం అందే వరకు పోరాటం ఆగదన్నారు.
ఆర్థిక, రాజకీయ విశే్లషకుడు పెంటపాటి పుల్లారావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం 2005లో భూసేకరణ చేశారని, ఐదేళ్లు దాటితే కొత్తగా అవార్డు ఇవ్వాల్సిందేనన్నారు. అందుకే తిరిగి భూ సేకరణ చేసి కొత్త చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని, నూరు శాతం పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. ఐదు లక్షల మంది నిర్వాసితులవుతున్నారని, 35 లక్షల మంది ప్రభావితమవుతున్నారని, అందరికీ కొత్త చట్టం ప్రకారం పరిహారాన్ని అందించేంత వరకు జాతీయ స్థాయి పోరాటాన్ని సాగించేందుకు సన్నద్ధం కావాలని, ఇక ఢిల్లీలోనే తేల్చుకుందామని, అన్ని పార్టీలు నిర్వాసితుల తరపున పోరాడటానికి సన్నద్ధం కావాలన్నారు.
మాజీ ఎంపి మిడియం బాబూరావు మాట్లాడుతూ పోలవరం విలీన మండలాల ప్రజలను ప్రభుత్వం ముందే ముంచేసిందని, నిర్వాసితులెవరికీ భూమికి భూమి ఇవ్వలేదని ఆందోళన వ్యక్తంచేశారు. వివక్షాపూరిత అభివృద్ధికి చిహ్నమైన పోలవరం నిర్వాసితుల తరపున జాతీయ స్థాయి పోరాటానికి సిద్ధమన్నారు. సమావేశంలో మాజీ ఎంపిలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జివి హర్షకుమార్, మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, సిపిఐ రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నిర్వాసితులు పాల్గొన్నారు.