ఆంధ్రప్రదేశ్‌

ఒక్కో నిరుద్యోగికి రూ.62 వేల బకాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా అబద్దాలు చెబుతూ యువతను మోసం చేస్తోందని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 31 నెలలైందని, నెలకు రెండు వేల రూపాయల చొప్పున ప్రతి నిరుద్యోగికి రూ. 62 వేలు బకాయిపడ్డారన్నారు. రాష్ట్రంలో మొత్తం ఒక కోటి 75 లక్ష ల కుటుంబాలకు ఒక్కో ఇంటిలోని నిరుద్యోగులకు ప్రభుత్వం నెలకు రెండు వేల రూపాయల చొప్పున భృతిని చెల్లిస్తామన్న హామీని అమలు చేయలేకపోయిందన్నారు. 1994 ఎన్నికల మ్యానిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని, ఒక హెచ్‌పికి రూ. 50 వసూలు చేస్తామని, కిలోబియ్యం రెండు రూపాయలకే ఇస్తామని చెప్పారని, కాని ఆ హామీని తుంగలో తొక్కిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు. వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదన్నారు. ఆటో డ్రైవర్లకు సొంతంగా ఆటోలు కొనుక్కోవడానికి బ్యాంకుల ద్వారా వడ్డీలు లేని రుణాలు ఇప్పిస్తామన్నారు. ఎల్‌కెజి నుంచి పిజి వరకు ప్రతి అమ్మాయికి పూర్తిగా ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పి మర్చిపోయారన్నారు. టిడిపి వెబ్‌సైట్ నుంచి ఎన్నికల హామీని తొలగించారన్నారు. టిడిపి ప్రభుత్వ పలాయన వాదానికి ఇది నిదర్శనమన్నారు.