ఆంధ్రప్రదేశ్‌

కేప్ టు రియో 2017కు నౌకాదళ సెయిలింగ్ బోట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 23: దక్షిణాఫ్రికా దేశానికి చెందిన రాయల్ కేప్ యాచ్ క్లబ్ నిర్వహిస్తున్న ‘కేప్ టు రియో 2017’లో పాల్గొనేందుకు భారత నౌకాదళానికి చెందిన సెయిలింగ్ బోట్ మదేయ్ కేప్‌టౌన్ హార్బర్‌కు శుక్రవారం చేరుకుంది.
గత ఆరంభంలో గోవా నుంచి బయలుదేరిన ఈ బోట్‌లో అందరూ మహిళలే కావడం విశేషం. ఆరుగురు మహిళా ఆఫీర్లతో కూడిన సెయిలింగ్ బోట్ మదేయ్‌కు లెఫ్టినెంట్ కమాండర్ వర్తిక జోషి నాయకత్వం వహించారు. సముద్రంలో బోట్ సెయిలింగ్‌లో అనేక సామర్థ్య పరీక్షల అనంతరం గోవాకు చెందిన కెప్టెన్ అతుల్ సిన్హా వీరికి ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. రియో రేస్‌లో పాల్గొనడానికి బయలుదేరే ముందు మదేయ్ బృందం
ఈ ఏడాది ఫిబ్రవరిలో విశాఖ నుంచి బయలుదేరి గోవాకు, అక్కడ నుంచి మారిషస్‌కు సుమారు 4,000 నాటికల్ మైళ్లు పయనించి జూలైలో తిరిగివచ్చింది. తదుపరి తమ జైత్రయాత్రలో భాగంగా దాదాపు 45 రోజుల పాటు పలు విపత్కర వాతావరణ పరిస్థితులు సమర్ధవంతంగా ఎదుర్కొని 5,000 నాటికన్ మైళ్లు పయనించి కేప్‌టౌన్ హార్బర్‌కు చేరుకోవడం ద్వారా వారు గుర్తింపు సాధించుకున్నారు. సారధి వర్తిక జోషితో పాటు లెఫ్టినెంట్ స్వాతి, ఐశ్వర్య, ప్రతిభ, విజయ, పాయల్ ఉన్నారు. ఈ అద్భుత పర్యటన ద్వారా పూర్తి మహిళా సెయిలర్లతో సుదీర సముద్రయానం చేసిన తొలి బృందంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

చిత్రం..మహిళా నావికులతో కేప్‌టౌన్ బయలుదేరిన నౌకా సిబ్బంది